విలన్ గా నటించనున్న మధుబాల
- August 07, 2018
నిన్న మొన్నటి వరకూ హీరోయిన్స్‌గా ఇండస్ట్రీని ఏలిన భామలంతా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టేస్తున్న విషయం తెలిసిందే. ఒకప్పటి ప్రముఖ హీరోయిన్ కూడా ఈ మధ్య సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. సూర్య వర్సెస్ సూర్య, నాన్నకు ప్రేమతో వంటి చిత్రాల్లో కీలక పాత్ర పోషించిన మధుబాల ప్రస్తుతం విలన్ అవతారమెత్తింది. తమిళ నటుడు బాబీ సింహ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 'అగ్ని దేవ' అనే సినిమాలో మధుబాల నటిస్తున్నారు.
జై ఫిల్మ్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జాన్ పాల్ రాజ్, శామ్ సూర్య డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటి వరకూ సాఫ్ట్ క్యారెక్టర్స్‌తో మెప్పించిన మధుబాల ఈ సినిమాలో నెగిటివ్ రోల్‌లో కనిపించనున్నారట. మొదటిసారి విలన్‌గా నటించినప్పటికీ మధుబాల అద్భుతంగా నటించారట. ఆమె పలికించిన హావభావాలు, చెప్పిన డైలాగ్స్ చాలా కొత్తగా ఉంటాయట. దీంతో మధుబాలకు ఈ సినిమా ద్వారా మంచి ఆఫర్స్ వస్తాయని చిత్రబృందం చెబుతోంది.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







