స్పెక్ట్రా 2018లో 5000 మంది చిన్నారులు

- August 08, 2018 , by Maagulf
స్పెక్ట్రా 2018లో 5000 మంది చిన్నారులు

ఇండియన్‌ కమ్యూనిటీ రిలీఫ్‌ ఫండ్‌ (ఐఆర్‌సిఎఫ్‌) 10వ ఎడిషన్‌ స్పెక్ట్రాని ఘనంగా నిర్వహించనుంది. కింగ్‌డమ్‌లో విద్యార్థులకు ఇది అతి పెద్ద కార్నివాల్‌ కాబోతోంది. యువతలో ఆర్టిస్టిక్‌ టాలెంట్‌ని వెలికి తీయడమే ఈ ఈవెంట్‌ ముఖ్య ఉద్దేశ్యం. సామాజిక మార్పులో యువత భాగస్వామ్యం ఎంతో విలువైనదనీ, ఈ క్రమంలోనే యువతలోని టాలెంట్‌ని వెలికి తీసేందుకు ఈవెంట్‌ని నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఐసిఆర్‌ఎఫ్‌ ఛైర్మనన్‌ అరుల్‌దాస్‌ థామస్‌ మాట్లాడుతూ, ఈ యాఉ్యవల్‌ ఈవెంట్‌ 2009లో ప్రారంభమయ్యింది. ఈ ఏడాది డిసెంబర్‌ 14న ఉదయం 7 గంటల నుంచి బహ్రెయిన్‌ ఇంటర్నేషనల్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో ఈ కార్యక్రమం జరుగుతుంది. 5,000 మంది చిన్నారులు పాలుపంచుకోనున్నట్లు ఆయన వివరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com