పాకిస్థాన్ కు ముచ్చెమటలు పట్టించే నిర్ణయం తీసుకున్న భారత్

- August 08, 2018 , by Maagulf
పాకిస్థాన్ కు ముచ్చెమటలు పట్టించే నిర్ణయం తీసుకున్న భారత్

భారత సర్కార్ ఓ సంచనాత్మకమైన ముందడుగు వేసింది. పాకిస్థాన్ కు ముచ్చెమటలు పట్టించే నిర్ణయం కావడం ఇందుకు ప్రత్యేకత. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు పాకిస్థాన్ ను తెగ ఇబ్బంది పెడుతోంది. అంతేకాకుండా తమ దేశం ఎక్కడ ఎడారిగా మారిపోతోందోనని భయపడుతోంది. అందుకు కారణం సరిహద్దుల్లో ఉన్న ఇండస్ నదిపై ఆనకట్టలు కట్టడమే..! ఆనకట్టలు పూర్తి అవుతున్నందున భారత వైఖరిని చూసి పాకిస్థాన్ తీవ్ర ఆందోళన చెందుతోంది. పాకిస్థాన్ లోని ప్రధాన నగరాలైన ఇస్లామాబాద్, లాహోర్ తదితర ప్రాంతాలకు ప్రధాన నీటివనరులుగా ఉన్న పంచ నదులపై భారత్ ఎగువ భాగంలో కడుతోంది.
 
ఈ సంవత్సరం మే 16వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ కృష్ణ గంగా హైడ్రో పవర్ ప్రాజెక్టును ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో పాక్ లో నిర్మాణ దశలో ఉన్న కలాబాగ్ డ్యామ్ (కేబీడీ) ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి. ఒకవేళ పూర్తయినా, నీరు రావాలంటే, ఇండియాను దాటుకునే నీరు రావాలి. దీంతో తమ భూభాగం, ముఖ్యంగా పొలాలు ఎండిపోతాయని, ప్రజలకు తాగేందుకు కూడా నీరు దొరకదని భయపడుతోంది పాక్.

ఇటీవల మీడియాతో మాట్లాడిన పాకిస్థాన్ జలవనరుల పరిరక్షణా శాఖ మంత్రి అలీ జాఫర్, ఇండియా తీరుపై పలు విమర్శలు చేశారు. ఒప్పందాలను తుంగలో తొక్కి సరిహద్దుల్లో పలు ప్రాజెక్టులను భారత్ నిర్మిస్తోందని ఆరోపించారు. ఈ డ్యాముల నిర్మాణం పూర్తయితే, పాకిస్థాన్ బీడు భూమిగా మారుతుందని అన్నారు. అందుకే భారత్ దెబ్బకు పాకిస్థాన్ వణికిపోతోంది. పంజాబ్ ప్రావిన్స్ లో డ్యామ్ లు కడుతుండటం పాక్ వణికిపోయేలా చేస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com