నేడే ఐకియా ప్రారంభం
- August 08, 2018
హైదరాబాద్: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐకియా హోమ్ ఫర్నీషింగ్ స్టోర్ గురువారం ప్రారంభానికి ముస్తాబైంది. అందరికి అందుబాటు ధరలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఉత్పత్తులను అందించే లక్ష్యంతో ఈ స్టోర్‌ను ప్రారంభిస్తున్నట్టు ఐకియా రీటైల్ ఇండియా సీఈవో పీటర్ బెట్జెల్ తెలిపారు. ప్రారంభానికి ముందు స్టోర్‌ను పరిశీలించేందకు మీడియాను ఆహ్వానించిన సందర్బంగా మీడియా ప్రతినిధులతో ఐకియా సీనియర్ అధికారులు మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ప్రోత్సాహంతో తొలి స్టోర్‌ను దిగ్విజయంగా ప్రారంభించగలుగుతున్నామని ఏర్పాటు చేయగలిగామని అన్నారు. దేశంలో రూ.10,500 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి 2013 పొందిన ఐకియా ఇప్పటి వరకు రూ. 4,500 కోట్లను వెచ్చించినట్టు తెలిపారు. ఇండియా తమకు ముఖ్యమైన మార్కెట్ అనీ, దీర్ఘకాలిక దృష్టితో ఐకియా స్టోర్స్‌ను దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్టు ఐకియా గ్రూపు సీఈవో జెస్పర్ బ్రోడిన్ తెలిపారు. దేశవ్యాప్తంగా 40 నగరాల్లో ఐకియా స్టోర్స్‌ను ఏర్పాటు చేస్తామని 2019 వేసవి నాటికి ముంబైలో రెండో స్టోర్‌ను ప్రారంభిస్తామని వెల్లడించారు. ఆ తర్వాత బెంగుళూరు, గురుగావ్‌లలో ప్రారంభిస్తామని వెల్లడించారు.
ప్రాధాన్యతగా మార్కెట్లుగా గుర్తించిన తెలంగాణ, మహారాష్ట్ర, ఢిల్లీ లో భూమిని కొనుగోలు చేసినట్టు తెలిపారు. 2025 నాటికి అహ్మదాబాద్, సూరత్, పూణే, చెన్నై, కోల్‌కతాలలో కూడా స్టోర్స్‌ను ప్రారంభించేందుకు ప్రణాళికలున్నట్టు తెలిపారు. వచ్చే మూడేండ్లలో 20 కోట్ల మంది వినియోగదారులను చేరుకోవాలన్న లక్ష్యంతో ఉన్నట్టు చెప్పారు. గత ముప్పై ఏండ్లుగా గ్లోబల్‌గా 49 దేశాల్లో ఉన్న 403 స్టోర్స్ కోసం ఇండియా నుంచి వివిధ ఉత్పత్తులను సమీకరిస్తున్నామని తెలిపారు.
దిగుమతులపై జరిమానాలు వద్దు: ఐకియా సీఈవో
దిగుమతులపై జరిమానాలు విధించడం కన్నా స్థానిక ఉత్పత్తుల సమీకరణకు ప్రొత్సాకాలు కల్పించాలని ఐకియా గ్రూప్ సీఈవో జెస్పర్ బ్రోడిన్ సూచించారు. దిగుమతులపై సుంకాలను పెంచడం వల్ల వినియోగదారులకు అందుబాటు ధరలో వస్తువులు లభించకపోగా, దేశీయంగా తయారీరంగంలో నైపుణ్యాన్ని పెంచలేదని అన్నారు. ఇండియా నుంచి గత 30 ఏండ్లుగా ఇండియాను ఎక్కువగా టెక్స్‌టైల్స్‌ను దిగుమతి చేసుకుంటున్న ఐకియా వుడెన్ వస్తువులతో పాటు అనేక ఇతర వస్తువులు దిగుమతి చేసుకుంటున్నది.
హైదరాబాద్ ఫస్ట్
ఐకియా స్టోర్ దేశంలో మరెన్ని స్టోర్స్‌ను ప్రారంభించినన హైదరాబాద్‌దే ఫస్ట్ అనేదే చారిత్రక సత్యం అవుతుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులను ప్రోత్సహించడానికి కార్మికవిధానంతో పాటు తూనికలు, కొలతల విధానాలు కూడా తెలంగాణ ప్రభుత్వం సవరించిందని తెలిపారు. కేంద్రం ప్రభుత్వం కూడా ఈ విధానాలను సమీక్షిస్తుందన్నా ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. హైటెక్‌సీటీ నడిబొడ్డున అత్యంత అనువైన ప్రదేశంలో ఏర్పాటు జరుగుతున్నందున ఈ ఐకియా స్టోర్‌పై వినియోగదారుల అంచనాలు భారీగా ఉన్నాయన్నారు. కాగా, హైదరాబాద్‌కు తొలి ఐకియా స్టోర్‌ను తీసుకురావడానికి చేసిన కృషిని మాజీ ఛీఫ్ సెక్రటరీ ప్రదీప్ చంద్ర వివరించారు.
ఐకియా ప్రత్యేకతలు
-13 ఎకరాల్లో 4 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించిన ఈ స్టోర్ కోసం రూ. 1000 కోట్లను వెచ్చింది. -మొత్తం 950 ప్రత్యక్ష ఉద్యోగులు మరో 1500 పరోక్ష ఉద్యోగులు ఈ స్టోర్‌లో పనిచేస్తున్నారు. అందులో కనీసం సగం మంది మహిళలే. -మొత్తం 7500 ఉత్పత్తులు ఈ స్టోర్‌లో లభిస్తాయి. అందులో 20 శాతం ఉత్పత్తులను స్థానికంగా కొనుగోలు చేస్తున్నది. -దాదాపు 1000 ఉత్పత్తులు రూ. 200 లోపే లభించనున్నాయి. -ఇందులో లభించే టెక్స్‌టైల్ ఉత్పత్తులన్నీ అత్యుత్తమ కాటన్‌తో తయారు చేసినవి. -స్టోర్‌లో ఉన్న మొత్తం లైట్లు ఎల్‌ఇడీలే. -ప్రపంచంలో అన్ని ఐకియా స్టోర్స్‌లోకెల్లా అతి పెద్ద రెస్టారెంట్ ఇక్కడే ఉంది. 1000 సీట్ల ఈ రెస్టారెంట్‌లో సగం ఆహార పదార్థాలు స్వీడిష్ స్పెషాలిటీస్ కాగా మిగిలిన సగం ఇండియన్ ఆహార పదార్థాలు. -స్కిల్ డెవలప్‌మెంట్ కోసం దిశ పైలట్ ప్రాజెక్టు కింద వంద మంది మహిళలను నియమించుకున్నారు. ఇందులో 8 మంది ఫోర్క్‌లిఫ్ట్ డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. -లైఫ్ ఎట్ హోమ్ ఇన్ హైదరాబాద్ థీమ్‌తో రెండు పూర్తి స్థాయి ఇండ్లను ప్రదర్శిస్తున్నారు. ఇందులో వివిధ గదుల అలంకరణ అందుబాటు ధరలో ఆధునికతకు అద్దం పట్టేలా రూపొందించారు. -ఈ స్టోర్ 365 రోజులూ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఓపెన్ చేసి ఉంటుంది.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







