షార్జాలో పెళ్ళయిన రెండు రోజులకే వధువు మృతి
- August 09, 2018
షార్జాలో ఓ మహిళ పెళ్ళయిన రెండు రోజులకే రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఈ ప్రమాదంలో భర్తకి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో అతనికి వైద్య చికిత్స అందుతోంది. అల్ కాసిమి హాస్పిటల్‌లో వైద్య చికిత్స అందుతోంది. మల్టిపుల్ ఫ్రాక్చర్స్‌తో వరుడు బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. సోమవారం ఈ ప్రమాదం జరిగింది. పాతికేళ్ళ వధువు హుయామ్, తన భర్త మొహ్మద్ అబ్దుల్లా అల్ జలాఫ్ తో కలిసి అల్ బయ్యాలోని కుటుంబ సభ్యుల్ని కలిసేందుకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. షార్జాకి తిరిగి వస్తున్న క్రమంలో ఎమిరేట్స్ రోడ్డు పై ప్రమాదం జరిగినట్లు వైద్యులు తెలిపారు. డ్రైవింగ్ చేస్తున్న వరుడు, ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడి, ఓ ట్రక్‌ని ఢీకొట్టినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







