కేవలం వాట్సాప్ ఒక్కటే కాదు..
- August 09, 2018
ఇప్పట్లో మొబైల్ లేని వాళ్లు కనిపించటమే అరుదు. అందునా మొబైల్ ఉన్న వాళ్లలో వాట్సప్ అంటే తెలియనివాళ్లు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. మొదట్లో కేవలం చాటింగ్ కోసం మాత్రమే ఉపయోపడే వాట్సప్ క్రమంగా వీడియోలు, ఫోటోలు, పంపించుకోవడం వంటి ఆప్షన్ ను అందుబాటులోకి తెచ్చింది. అయితే అది కూడా అయిపోయి ప్రస్తుతం ఆడియో, వీడియో కాలింగ్ వంటి ఆప్షన్స్ తో.. వాడకంలో ముందంజలో ఉంది. అయితే అన్ని బాగానే ఉన్నా ఈ మధ్య కాలంలో వచ్చే ‘కంటెంట్ గోప్యత’ వినియోగదారులను భయబ్రాంతులకు గురిచేస్తోంది. సంస్థ డెవలపర్స్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్ ను అప్ గ్రేడ్ చేస్తున్నా.. ఫేక్ సమాచారం చక్కర్లు కొడుతూనే ఉంది.
అయితే వాట్సప్‌కు ధీటుగా ఎన్నో ప్రముఖ యాప్‌లు అందుబాటులో ఉన్నాయంటున్నారు టెకీ నిపుణులు. సమాచార గోప్యతకు అవి కూడా ఉపయోగపడొచ్చని అభిప్రాయపడుతున్నారు. ఇటువంటి యాప్‌లలో హైక్, టెలిగ్రామ్, సిగ్నల్, వీచాట్, వైబర్, లైన్ మొదలైనవి ఉన్నాయి. కొత్తదనం కోరుకునేవారు ఈ యాప్‌లను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని వాడి చూడవచ్చు. గోప్యత విషయంలో వాట్సాప్ కంటే హైక్ యాప్ ముందు వరుసలో ఉంది . ప్రైవేట్ చాట్ల సమాచారం కాపాడుకునేందుకు హైక్‌లో పాస్వర్డ్ విధానం అందుబాటులో ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా వీచాట్, లైన్ లలో ఫేక్ సమాచారం వచ్చే అవకాశాలు తక్కువనే అంటున్నారు. సో.. మార్పు కోరుకునే వారు మిగతా యాప్ లను కూడా వాడి చూడవచ్చు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







