అస్సోం:6లక్షల మద్యం సీసాలు ధ్వంసం..
- August 11, 2018
అస్సోం:ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 6లక్షల మద్యం సీసాలను ఓ మంత్రి రోడ్డు రోలర్ తో తొక్కించి.. వాటిని ధ్వంసం చేశాడు. ఈ సంఘటన అస్సోం రాష్ట్రంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...
అక్రమంగా మద్యం తయారు చేస్తున్నవారిపై అసోం ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. అందరూ చూస్తుండగానే రూ.168.5 కోట్ల విలువ చేసే మద్యాన్ని అసోం ప్రభుత్వం రోడ్ రోలర్‌తో తొక్కించింది. ఏకంగా ఎక్సైజ్ మంత్రి పరిమళ్ శుక్లబైద్యనే శుక్రవారం రోడ్ రోలర్ నడిపి 6 లక్షల లిక్కర్ బాటిళ్లను ధ్వంసం చేశారు.
2016లో ఎక్సైజ్, పోలీసు అధికారులు దాడులు జరిపిన దాడుల్లో కర్బీ జిల్లాలోని కాట్‌కాటీలోని నాలుగు ప్రాంతాల్లో 14 ట్రక్కుల మద్యాన్ని పట్టుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా తయారు చేసిన ఈ మద్యాన్ని గువాహటికి సరఫరా చేయడానికి సిద్దంగా ఉన్నట్టు పోలీసులు గుర్తించి సీజ్ చేశారు. ఈ వ్యవహారంలో మొత్తం 13 మందిపైన పోలీసులు కేసులు నమోదు చేశారు.
కోర్టు నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో సీజ్ చేసిన మద్యాన్ని గోర్‌చుక్‌లో అందరూ చూస్తుండగానే రోడ్‌రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేశామని మంత్రి పరిమళ్ శుక్లబైద్య తెలిపారు. అక్రమంగా మద్యాన్ని తయారు చేసి, సరఫరా చేయాలనుకున్న వారికి ఇదొక హెచ్చరిక వంటిదని పేర్కొన్నారు. అసోం ప్రభుత్వ లెక్కల ప్రకారం దాదాపు 39, 085 లీటర్ల విదేశీ మద్యం ప్రతి రోజు అమ్ముడవుతోంది. అసోం వ్యాప్తంగా 1,448 లైసెన్స్‌లు కలిగిన వైన్ షాపులు ఉన్నాయి.
తాజా వార్తలు
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







