ఇండియా:తొలి మహిళా కమాండో టీమ్ సిద్ధం
- August 11, 2018
భారత దేశపు తొలి మహిళా టీమ్ స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్ (స్వాట్-SWAT) శుక్రవారం ఏర్పాటైంది. పూర్తి మహిళా కమాండో స్క్వాడ్‌లతో కూడిన మొదటి స్వాట్ టీమ్ ఇదే కావడం విశేషం. 36 మందితో కూడిన ఈ బృందం 15 నెలల పాటు భారత ఆర్మీ, ఇజ్రాయిల్ భద్రతాదళం వద్ద ప్రత్యేక శిక్షణ పొంది.. సేవలందించేందుకు సిద్దమైంది. ఈ బృందంలో ఉన్న మహిళలందరూ ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వారు కాగా.. తీవ్రవాదుల ఊహకందని రీతిలో దాడులను తిప్పికొట్టడం ఈ టీమ్ ప్రత్యేకత.
యుద్ధవిన్యాసాలతో పాటు ఆయుధాల నిర్వహణ వంటి టెక్నిక్స్‌లలో ఈ టీమ్ సభ్యులు ఆరితేరారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్(ఎన్‌ఎస్‌జీ), లాంగ్వేజ్ సంబంధించిన శిక్షణ కూడా తీసుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో సేవలందిస్తున్న ఐదు కమాండో టీమ్‌లతో కలిసి ఈ మహిళా టీమ్ కూడా సేవలందిస్తుందని సీనియర్ ఢిల్లీ పోలీస్ అధికారి ప్రమోద్ కుష్వాహా తెలిపారు.
పంద్రాగస్టున స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ప్రధాని మోదీ సందేశం ఇస్తుండగా.. ఈ కొత్త షీ టీమ్ భద్రతను పర్యవేక్షిస్తుంది. ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేసేందుకు కేంద్రం స్వాట్ టీమ్‌ను నియమించింది. దేశ రాజధానితో పాటు ప్రధాని మోదీకి భద్రతగా హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ బృందాన్ని ఢిల్లీ పోలీసు శాఖలో నియమించారు.
తాజా వార్తలు
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!







