దగ్గుబాటి రానా సమర్పిస్తున్న చిత్రానికి రిలీజ్ డేట్ ఫిక్స్
- August 11, 2018
'కేరాఫ్ కంచరపాలెం' సినిమా సెప్టెంబర్ 7న విడుదల చేసేందుకు డేట్ ఫిక్స్ చేశారు. వైజాగ్‌కు చేరువగా ఉన్న కంచరపాలెం నేపథ్యంలో సాగే భిన్నమైన ప్రేమకథా చిత్రం 'కేరాఫ్ కంచరపాలెం'. ఈ ఏడాది న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు తెలుగు నుంచి ఎంపికైన తొలి సినిమా ఇది. రానా దగ్గుపాటి ఈ చిత్రాన్ని చూసి.. నచ్చి తనే విడుదల చేయడానికి ముందుకొచ్చినట్లుగా ఈ మధ్య ఓ ప్రెస్మీట్లో చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆయన సమర్పణలోనే 'కేరాఫ్ కంచరపాలెం' విడుదలవుతోంది. న్యూయార్క్‌కు చెందిన కార్డియాలజిస్ట్ విజయ ప్రవీణ పరుచూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. స్వీకర్ అగస్తి ఈ చిత్రానికి సంగీతం అందించారు. సుబ్బారావ్, రాధాబెస్సి, కేశవ కర్రి, నిత్యశ్రీ గోరు, కార్తిక్ రత్నం, విజయ ప్రవీణ, మోహన్ భగత్, ప్రణీత పట్నాయక్ తదితరులు ఈ చిత్రంలోని తారాగణం.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







