వరదకు అల్లాడుతున్న కేరళ
- August 11, 2018
కేరళలో వరద బీభత్సం కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 37 మంది మరణించగా, 35,874 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. భారీ వర్షాలకు పెరియార్ నదికి వరద పోటెత్తుతోంది. దీంతో పరీవాహాక ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. వరద బాధితుల సహాయార్థం తమిళనాడు ప్రభుత్వం 5 కోట్లు, సినీ నటులు కమల్ రూ.25 లక్షలు, సూర్య, కార్తీలు కలిపి రూ.25 లక్షలు విరాళాలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కేరళ సర్కారుకు తగినన్ని సహాయనిధులు కేటాయించాలని ప్రధానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ లేఖ రాశారు. ఏపీ, కర్ణాటక తీరప్రాంతాలు, తమిళనాడు, బెంగాల్, కేరళ, సిక్కిం, హిమాచల్, యూపీ, ఛత్తీస్‌గఢ్, బిహార్, జార్ఖండ్, ఒడిశా, అరుణాచల్, మేఘాలయ, అస్సాంలోనూ అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్‌డీఎంఏ) హెచ్చరించింది.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







