నోబెల్ గ్రహీత వీఎస్ నైపాల్ కన్నుమూత
- August 11, 2018
సాహిత్యంలో నోబెల్ పురస్కారం అందుకున్న ప్రముఖ రచయిత వీఎస్ నైపాల్ కన్నుమూశారు. ఆయన కుటుంబం నుంచి అందిన సమాచారం ప్రకారం 85 ఏళ్ల వయసున్న నైపాల్ లండన్‌లో ఉన్న తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
భారతీయ సంతతికి చెందిన నైపాల్ 1932లో ట్రినిడాడ్‌లో జన్మించారు. ట్రినిడాడ్‌లోనే పెరిగిన నైపాల్ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేశారు. రచనా రంగంలోకి రాక ముందు ఆయన బీబీసీ కోసం కూడా పనిచేశారు. ఆయన నవలల్లో 'ఎ బాండ్ ఇన్ ద రివర్', 'ఎ హౌస్ ఫర్ మిస్టర్ బిశ్వాస్' చాలా ప్రముఖమైనవి. నైపాల్‌కు 1971లో బుకర్ ప్రైజ్, 2001లో సాహిత్యంలో నోబెల్ పురస్కారం లభించాయి.
ఒకసారి ఆత్మహత్యాయత్నం కూడా చేశారు
"ఆయన తన జీవితాన్ని సృజనాత్మకంగా గడిపారు. ఆఖరి సమయంలో ఆయనకు ఇష్టమైనవారందరూ తనతోనే ఉన్నారు" అని నైపాల్ మరణం తర్వాత ఆయన భార్య తెలిపారు. 1950లో నైపాల్ ఒక ప్రభుత్వ స్కాలర్‌షిప్ గెలుచుకున్నారు. దీని ద్వారా ఆయనకు తను కోరుకున్న యూనివర్సిటీలో అడ్మిషన్ లభించి ఉండేది. కానీ ఆయన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో చేరారు. విద్యార్థిగా ఉన్నప్పుడు డిప్రెషన్‌కు గురైన ఆయన ఒకసారి ఆత్మహత్యాయత్నం కూడా చేశారు. ఆయన మొదటి పుస్తకం 'ద మిస్టిక్ మెసర్', 1951లో ప్రచురితమైంది. తర్వాత పదేళ్లకు ప్రచురితమైన ఆయన ప్రముఖ నవల 'ఎ హౌస్ ఫర్ మిస్టర్ బిశ్వాస్' రాయడానికి మూడేళ్లకు పైగానే పట్టింది.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







