కోహ్లీగా దుల్కర్‌?

- August 11, 2018 , by Maagulf
కోహ్లీగా దుల్కర్‌?

మలయాళం, తమిళ, తెలుగులో అభిమానులను సంపాదించుకున్న యువ నటుడు దుల్కర్ సల్మాన్ 'జోయా ఫ్యాక్టర్' సినిమాతో బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇస్తున్నాడు. అంజు చౌహాన్ రచించిన 'ది జోయా ఫ్యాక్టర్' ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సోనమ్ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ముఖ్య విషయమైంటంటే.. ఈ సినిమాలో దుల్కర్‌ సల్మాన్‌.. విరాట్‌ కోహ్లీ పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. అడ్వర్టయిజింగ్‌ ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసే ఓ రాజ్‌పుత్‌ యువతి భారత్‌ జట్టును కలవడం.. ఆపై వరల్డ్‌కప్‌ గెలవడం.. ఇదీ కథ ఇతివృత్తం. 2011 వన్డే వరల్డ్‌ కప్‌ నెగ్గిన టీమిండియా చుట్టూ కథ సాగుతుంది. అడ్లాబ్స్ ఫిలింస్- ఫాక్స్ స్టార్ స్టూడియోలు సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com