ఈద్ అల్ అధా ఫైర్ వర్క్స్ అద్భుతం.. ఎక్కడంటే!
- August 11, 2018
యూఏఈలో ఈద్ అల్ అధా సందర్భంగా ఆగస్ట్ 21న ఆకాశంలో కళ్ళు చెదిరేలా ఫైర్ వర్క్స్ అలరించనున్నాయి. ప్రతి యేడాదీ యూఏఈ ఫైర్ వర్క్స్, కాన్సెర్ట్స్ సహా పలు ఆకర్షణల్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తూ వస్తోంది. వీటిల్లో కొన్ని ప్రాంతాలు ఫైర్ వర్క్స్ అద్భుతానికి కేంద్ర బిందువులుగా మారాయి. దుబాయ్ వ్యాప్తంగా ఫైర్ వర్క్క్స్‌ని తిలకించే వీలుంది. ద బీచ్‌లో ఆగస్ట్ 22 నుంచి ఆగస్ట్ 24 వరకు రాత్రి 8.30 నిమిషాల నుంచి ఆకాశంలో అద్భుతం సాక్షాత్కరిస్తుంది. లా మెర్‌లో రాత్రి 9.30 నిమిషాల నుంచి వీకెండ్స్‌లో ఫైర్ వర్క్స్ సందడి కన్పిస్తుంది. దుబాయ్ ఫెస్టివల్ సిటీలో మ్యూజికల్ ఫైర్ వర్క్ ప్రధాన ఆకర్షణ. ఆగస్ట్ 22 నుంచి 23 వరకు రాత్రి రాత్రి 9 గంటల నుంచి 10.30 నిమిషాల వరకు ఈ ఫెస్టివల్ వుంటుంది. అల్ సీఫ్‌లో మూడు రోజులపాటు రాత్రి 9 గంటల వరకు ఆకాశంలో అద్భుతం ఆవిష్కరణ జరుగుతుంది. అబుదాబీలో మూడు రోజులపాటు ఫైర్ వర్క్స్ సందర్శకుల్ని అలరించనున్నాయి. క్రూయిజ్‌ని బుక్ చేసుకుని కూడా వీటిని తిలకించొచ్చు. యాస్ మెరీనా నుంచి డిన్నర్ చేస్తూ ఫైర్ వర్క్స్ వెలుగుల్ని ఆస్వాదించడం మరో అద్భుతమైన అనుభూతి. రాత్రి 9 గంటల నుంచి ఈ అద్భుతాన్ని ఆస్వాదించొచ్చు.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







