అబుదాబీ రోడ్లపై బఫర్ ఎత్తివేత
- August 11, 2018
అబుదాబీ రోడ్లపై వేగ పరిమితికి సంబంధించి బఫర్ పీరియడ్‌ని ఎత్తివేశారు. నేటి నుంచి ఎలాంటి బఫర్ లిమిట్ లేకుండానే స్పీడ్ లిమిట్‌ని అమలు చేస్తున్నారు. గంటకు 120 కిలోమీటర్ల వేగాన్ని పరిమితిగా నిర్ణయిస్తే, 121 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినా, రాడార్ గుర్తిస్తుంది. గతంలో 120 కిలోమీటర్ల స్పీడ్ లిమిట్‌కి మరో 20 కిలోమీటర్ల బఫర్ వుండేది. ఇప్పుడు బఫర్ ఎత్తివేయడంతో ఒక్క కిలోమీటర్ వేగానికి 1,000 బహ్రెయినీ దినార్స్ జరీమానా చెల్లించాల్సి రావొచ్చు. గత కొంతకాలంగా ఈ బఫర్‌పై అవగాహన కల్పిస్తూ వచ్చారు ట్రాఫిక్ పోలీసులు. పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల్ని తగ్గించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. వేగ పరిమితి విషయంలో పోలీసుల నిర్ణయాల్ని వాహనదారులు ఆహ్వానిస్తున్నారు. ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని అమలు చేయడం వల్ల వాహన వేగాలు అదుపులో వుంటాయని వారు చెబుతున్నారు. ఇదివరకు 120 కిలోమీట్ల వేగ లిమిట్ వుంటే, 140 కిలోమీటర్ల వరకు వుండే బఫర్‌ని వినియోగించుకుని అదనపు వేగంతో వాహనాలు నడిపేవారనీ, ఇకపై ఆ పరిస్థితి వుండదని వాహనదారులు చెప్పారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







