హైదరాబాద్ లో 'సైమా' కర్టెన్‌రైజర్
- August 12, 2018
హైదరాబాద్:సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ సినిమా అవార్డ్స్(సైమా, 2018) ఏడవ వార్షికోత్సవం సెప్టెంబర్14, 15 తేదీల్లో దుబాయ్‌లో 'అంజన్ స్టార్ ఈవెంట్స్'సంస్థ వారు నిర్వహిస్తున్నారు. దక్షిణాది చిత్ర పరిశ్రమల కళాకారులను ప్రోత్సహించే ఈ అవార్డుల వేడుకకు సంబంధించిన కర్టెన్‌రైజర్ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. రానా దగ్గుబాటి, ప్రణీత, ప్రగ్యా జైస్వాల్, శాన్వి, శుభ్ర అయ్యప్ప, సైమా ఛైర్పర్సన్ అడుసుమిల్లి బృందాప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగు, కన్నడ భాషల్లో నిర్వహించిన షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్‌లో విజేతలకు పలు కేటగిరీల్లో హీరో రానా అవార్డులను అందజేశారు. '''సైమా ప్రారంభమై అప్పుడే ఆరేళ్ళు అయిందంటే నమ్మలేకపోతున్నా. ఈ అవార్డు ఫంక్షన్‌తోనే నేను యాంకర్ అయ్యా. అందుకే నాకు సైమాతో ప్రత్యేక అనుబంధం వుంది. కళాకారుడికి అవార్డ్ వెయ్యి ఏనుగుల బలాన్నిస్తుంది. ప్రతిభ ఉన్నవారిని ప్రోత్సహించడానికి 'సైమా' చక్కని వేదిక అయింది.
న్యూ టాలెంట్స్‌ని ఎంకరేజ్ చెయ్యడానికి ఈ ఏడాది షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ నిర్వహించడం మంచి పరిణామం. షార్ట్ ఫిల్మ్ తీసి డిజిటల్ ప్లాట్‌ఫారమ్ మీద నిరూపించుకున్న చాలామంది యువత సినిమాల్లో దర్శకులుగా, ఆర్టిస్ట్‌లుగా రాణిస్తున్నారు'' అని రానా దగ్గుబాటి తెలిపారు. ''ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ అవార్డుల వేడుకను నిర్వహిస్తున్నాం. సినీ తారలను ప్రోత్సహించడానికి సైమా ఎంతో ఉపయోగపడుతుంది'' అని అడుసుమిల్లి బృందా ప్రసాద్ చెప్పారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







