5 రోజుల ఈద్ మెగా సేల్: 75 శాతం డిస్కౌంట్స్
- August 14, 2018
దుబాయ్:దుబాయ్ సమ్మర్ సర్ప్రైజ్ వీకెండ్ ఇటీవల ముగిసిన సంగతి తెల్సిందే. అయితే ఈద్ అల్ అదా సెలబ్రేషన్స్‌లో భాగంగా ఆగస్ట్ 15 నుంచి ఆగస్ట్ 19 వరకు ఐదు రోజులపాటు ప్రత్యేక అమ్మకాలు షాపింగ్ ప్రియుల్ని అలరించనున్నాయి. 75 శాతం వరకు డిస్కౌంట్స్‌తో ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్స్ షాపింగ్ ప్రియుల కోసం సిద్ధమవుతున్నాయి. దుబాయ్ వరల్డ్ సెంటర్లో బిగ్ బ్రాండ్స్ ఫెస్టివల్ సిద్ధమవుతోంది. యూఏఈలో అతి పెద్ద సేల్స్ ఈవెంట్స్‌లో ఇదీ ఒకటి కాబోతోంది. దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లోని షేక్ మక్తౌమ్ హాల్లో ముందెన్నడూ లేనంత తక్కువ ధరలకు వివిధ ప్రోడక్ట్స్ అందుబాటులోకి రానున్నాయి. షూస్, అప్పారెల్స్, కాస్మొటిక్స్, పెర్ఫ్యూమ్స్ ప్రధానంగా అతి తక్కువ ధరలకు లభిస్తాయి. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ షాపింగ్ అందుబాటులో ఉంటుంది.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







