ఎన్టీఆర్ బయోపిక్.. బాలయ్య బాబు ఫస్ట్ లుక్ విడుదల
- August 14, 2018
క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలయ్యబాబు హీరోగా నటిస్తున్న సినిమా ఎన్టీఆర్. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని.. ఎన్టీఆర్ బయోపిక్ లో .. నందమూరి బాలకృష్ణ ఫస్ట్ లుక్‌ని సినిమా యూనిట్ రిలీజ్ చేసింది. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు.. తెలుగు వారి గుండెచప్పుడు.. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ తన తండ్రి పాత్రలో నటిస్తున్నాడు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఈ ఫస్ట్ లుక్‌ని చూసిన ఫాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఎన్టీఆర్ లుక్ లో ఉన్న బాలకృష్ణ పిక్‌ని చూసిన అభిమానులంతా.. అచ్ఛం ఎన్టీఆర్ లా ఉన్నారని మురిసిపోతున్నారు. ఈ పిక్‌తో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఎన్టీఆర్ బయోపిక్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ పిక్ మరింత జోష్‌ని ఇచ్చింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి