దుబాయ్ ర్యాఫిల్: 1 మిలియన్ డాలర్స్ గెల్చుకున్న ఇండియన్
- August 14, 2018
దుబాయ్:దుబాయ్ డ్యూటీ ఫ్రీ ర్యాఫిల్ లో 47 ఏళ్ళ భారతీయుడొకరు 1 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీని గెల్చుకున్నారు. కేరళకు చెందిన జెఐ చాకో, జెడ్డాలోని ఓ పార్మాస్యూటికల్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఐదేళ్ళుగా తాను ఈ క్షణం కోసం ఎదురుచూస్తున్నానని చాకో చెప్పారు. ఐదేళ్ళుగా చాకో మిలియనియం డ్రాలో పాల్గొంటూ వస్తున్నారు. ఇదిలా ఉండగా, దుబాయ్ డ్యూటీ ఫ్రీ రపాలెలో మరో సర్‌ప్రైజ్ కూడా ఉంది. 48 ఏళ్ళ కువైటీ జాతీయుడు నవాఫ్ మొహమ్మద్ అల్నాజ్దీ బెంట్లే కాంటినెంటల్ ఫ్లైయింగ్ స్పెర్ గెల్చుకున్నారు. దుబాయ్‌లో స్థిరపడ్డ భారత జాతీయుడు కారుప్పన్ చెల్లయ్య ఫ్రెడ్రిక్ రేంజ్ రోవర్ హెచ్‌ఎస్‌ఇ కారుని గెల్చుకున్నారు. మరో కేరళ వాసి పుష్పరాజ్ మునియూర్ బిఎండబ్ల్యు ఎస్ 1000 ఆర్‌ఆర్ మోటర్ బైక్‌ని గెల్చుకున్నారు. పాకిస్తానా జతీయుడు మరూఫ్ సుమ్రో బిఎండబ్ల్యు ఎస్ 1000 ఆర్ మోటార్ బైక్‌ని గెల్చుకున్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







