జన్ ఆరోగ్య అభియాన్ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన మోదీ

- August 14, 2018 , by Maagulf
జన్ ఆరోగ్య అభియాన్ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన మోదీ

దేశ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రధానమంత్రి జన్ ఆరోగ్య అభియాన్ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగం సందర్భంగా ఈ పథకాన్ని మోదీ ప్రకటించారు. సెప్టెంబర్ 25వ తేదీ (పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి) నుంచి ఈ పథకం ప్రారంభం అవుతుందని చెప్పారు. ఈ పథకం ద్వారా పేదలందరికీ ఉచితంగా వైద్యసాయం అందిస్తామన్నారు.

తొలివిడతగా దేశంలోని 10 కోట్ల మందికి వర్తింపజేస్తామన్న ఆయన.. ఆరోగ్య భారత్ లక్ష్యంగా ఈ పథకం పనిచేస్తుందని అన్నారు. ఈ పథకం అమలు కోసం అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తామని.. అవసరమైన సిబ్బంది, సదుపాయాలు కల్పిస్తామని మోదీ చెప్పారు. గడిచిన రెండేళ్లలో 5 కోట్ల మంది దారిద్య్ర రేఖకు ఎగువకు చేరుకున్నారని మోదీ అన్నారు. స్వచ్ఛ భారత్ వల్ల దేశంలోని ఎంతో మంది చిన్నారుల ప్రాణాలు రక్షించామని, మూడు లక్షల మందికి స్వచ్ఛ భారత్ రక్షించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO ) తెలిపిందని గుర్తు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com