'మణికర్ణిక' ఫస్ట్ లుక్
- August 14, 2018
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో ఝాన్సీ లక్ష్మీబాయి కథతో క్రిష్ తెరకెక్కించిన చిత్రం మణికర్ణిక - ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. శత్రువులు చుట్టుముట్టినప్పుడు ఆమె చూపిన వీరపరాక్రమం గురించి సినిమాలో అద్భుతంగా చూపించనున్నారట. చిత్రాన్ని స్వాతంత్య్రదినోత్సవ శుభాకాంక్షలతో విడుదల చేయాలని ముందుగా భావించారు. కాని వీఎఫ్ఎక్స్కి సంబంధించిన వర్క్ పూర్తి కాకపోవడంతో జనవరి 25న సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఇన్నాళ్లు చిత్రానికి సంబంధించిన పిక్స్ లీక్ కాగా, ఈ రోజు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇందులో కంగనా వీర పరాక్రమంతో గుర్రంపై స్వారీ చేస్తున్ననట్టుగా ఉంది. ఇది ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తుంది. సంగీత త్రయం శంకర్- ఎహసాన్- లాయ్ లు సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. మణికర్ణికకి పోటీగా సూపర్ 30 విడుదల కానున్నట్టు సమాచారం
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి