భారతరత్న అటల్ బిహారీ వాజపేయి ఇకలేరు..

- August 16, 2018 , by Maagulf
భారతరత్న అటల్ బిహారీ వాజపేయి ఇకలేరు..

ఢిల్లీ:మాజీ ప్రధాన మంత్రి వాజ్‌పేయి ఇక లేరు.. తీవ్ర అనారోగ్యంతో ఆసపత్రిలో చేరిన ఆయన తుది శ్వాస విడిచారు. ఎయిమ్స్‌ డైరెక్టర్‌ ఆధ్వర్యంలోని దాదాపు 15 మంది వైద్యుల బృందం వాజ్‌పేయీకి చికిత్స అందించారు. ఒక ప్రత్యేకమైన వార్డులో ఆయనకు చికిత్స చేశారు. అయినా ఆయన వైద్యానికి ఏ మాత్రం స్పందించలేదు. అధికారికంగా ఇప్పటికే వైద్యులు వాజ్‌పేయి మృతిని ధృవీకరించారు.

అటల్ బిహారీ వాజపేయి డిసెంబర్ 25 1924 న గ్వాలియర్ లోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు కృష్ణాదేవి, కృష్ణబిహారీ వాజపేయి. పూర్వీకుల నివాస ప్రాంతమైన ఉత్తరప్రదేశ్ లోని బటేశ్వర్ నుండి గ్వాలియర్ లోని మొరీనాకు వలస వెళ్ళారు. ఆయన తండ్రి కృష్ణబిహారీ వాజపేయి గ్వాలియర్ ప్రాంతంలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. వాజపేయి గ్వాలియర్ లోని సరస్వతి శిశు మందిర్ లో విద్యాభ్యాసం చేశారు. అక్కడే విక్టోరియా కళాశాల లో చేరి హిందీ, ఇంగ్లీష్‌, సంస్కృతంలో డిగ్రీ పట్టా తీసుకున్నారు. రాజనీతిశాస్త్రంలో ఎం.ఎ పట్టాను అందుకున్నారు.

వాజపేయి గ్వాలియర్లో ఆర్య సమాజపు యువ విభాగమైన ఆర్య కుమార్ సభతో తన సామాజిక సేవా కార్యక్రమాలతో రాజకీయ జీవితం ప్రారంభించారు. 1939 లోనే ఆయన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ – RSSలో చేరారు. బాబా ఆమ్టే ప్రభావం ఆయనపై ఎక్కువుగా ఉండేది. 1947 లో RSS ప్రచారక్ గా నియమితులయ్యారు. దీన్ దయాల్ ఉపాధ్యాయ్ నడిపించిన రాష్ట్రధర్మ, పాంచజన్య, స్వదేశ్, వీర్ అర్జున్ వంటి దిన పత్రికలలోనూ పనిచేశారు. ఆయనకున్న వాగ్ధాటి,నాయకత్వ లక్షల కారణంగా జనసంఘ్ లో ముఖ్యనేతగా ఎదిగారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ మరణానంతరం జనసంఘ్ బాధ్యత వాజపేయిపై పడింది. 1968 లో జనసంఘ్ జాతీయ అధ్యక్షుడయ్యారు. నానాజీ దేశ్‌ముఖ్, బాల్‌రాజ్ మధోక్ మరియు లాల్ కృష్ణ అద్వానీ లతో కలిసి జనసంఘ్ ను జాతీయస్థాయి గుర్తింపును తీసుకొచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com