బహ్రెయిన్‌లో భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
- August 16, 2018బహ్రెయిన్:ఇండియన్ ఎంబసీ సహా, బహ్రెయిన్‌లోని పలు ప్రాంతాల్లో భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్ని నిర్వహించారు. ఇండియన్ ఎంబసీ, పలు భారత వలసదారుల ఆర్గనైజేషన్స్ దేశభక్తితో ఈ కార్యక్రమాల్ని నిర్వహించడం జరిగింది. ఎంబసీ పరిసరాల్లో ఇండియన్ ఎంబసీ నిర్వహించిన వేడుకలకు పెద్దయెత్తున భారతీయులు హాజరయ్యారు. బహ్రెయిన్‌లో భారత రాయబారి అలోక్ వి సిన్హా, మువ్వన్నెల జెండాని ఎగురవేశారు. సెకెండ్ సెక్రెటరీ ఆనంద్ ప్రకాష్, ఇతర ఎంబసీ అధికారులు, ఇండియన్ కమ్యూనిటీ లీడర్స్ ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు. ఎంబసీ, డిప్లమాట్ రాడిస్సన్ బ్లూ హోటల్లో నిర్వహించిన రిసెప్షన్‌కి ఇండియన్ కమ్యూనిటీ మెంబర్స్ హాజరయ్యారు. అసిస్టెంట్ ఫారిన్ మినిస్టర్ అబ్దుల్లా బిన్ ఫైసల్ అల్ దోసెరి, ఫారిన్ మినిస్ట్రీ అండర్ సెక్రెటరీ డాక్టర్ షేకా రానా బింట్ ఇసా అల్ ఖలీఫా తదితరులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!