న్యూజెర్సీ:మరో సిక్కు వ్యక్తి హత్య
- August 17, 2018
న్యూయార్క్:న్యూజెర్సీలో సిక్కు కమ్యూనిటీకి చెందిన మరో వ్యక్తి హత్యకు గురయ్యాడు. మూడు వారాల్లోనే ముగ్గురు సిక్కు వ్యక్తులను అమెరికాలో హత్య చేశారు. టేర్లోక్ సింగ్ అనే వ్యక్తి గత ఆరు సంవత్సరాల నుంచి న్యూజెర్సీలో స్టోర్‌ను నడుపుతున్నాడు. అయితే గురువారం రాత్రి స్టోర్‌లోకి ప్రవేశించిన దుండగులు టేర్లోక్‌ను హత్య చేశారు. సింగ్ ఛాతీపై కత్తిపోట్లు ఉన్నాయి. రక్తపు మడుగులో పడి ఉన్న సింగ్‌ను చూసి స్టోర్ సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. టేర్లోక్ భార్య పిల్లలు ఇండియాలోనే నివసిస్తున్నారు. ఆగస్టు 6న సాహిబ్ సింగ్(71) అనే వ్యక్తిని మార్నింగ్ వాక్‌లో దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. జులై 31న సుర్జిత్ మల్హీ(50)ను మీ దేశానికి వెళ్లిపో అని హింసిస్తూ హత్య చేశారు.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







