ఇరాన్ అణు ఒప్పందానికి కట్టుబడ్డాం : తేల్చి చెప్పిన రష్యా, చైనా
- August 18, 2018మాస్కో : ఇరాన్ అణు ఒప్పందానికి కట్టుబడి వుంటామని రష్యా, చైనా స్పష్టం చేశాయి. అమెరికా కొత్త ఆంక్షల నేపథ్యంలో ఇరాన్‌తో తమ సంబంధాలను, సహకారాన్ని కొనసాగిస్తామని తెలిపాయి. 2015లో కుదిరిన సంయుక్త సమగ్ర కార్యాచరణ ఒప్పందం (జెసిపిఓఎ) పూర్తి స్థాయి అమలుకు, ఒప్పందాన్ని పరిరక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇరాన్ అణు ఒప్పందం అవసరాలకు అనుగుణంగా రష్యా అణు ఇంధన సహకార సంస్థ పలు ప్రాజెక్టులు చేపడుతోందని తెలిపింది. అణు ఇంధన శాంతియుత ప్రయోజనాల కోసం నిర్దిష్ట రంగాల్లో ఇరాన్‌కు సహకారం అందిస్తామని రష్యా హామీ ఇచ్చింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ విడిగా ఒక ప్రకటన చేస్తూ ఇరాన్‌తో తమ సంబంధాలు, సహకారం యధావిధిగా కొనసాగుతాయని తెలిపారు. ఇరాన్ విదేశాంగ మంత్రితో ఫోన్లో మాట్లాడిన వాంగ్, ఈ ఒప్పందం అంతర్జాతీయ మానవాళి ఉమ్మడి ప్రయోజనాలకు అనుగుణంగా వుందన్నారు.
తాజా వార్తలు
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్‌లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!