'ఓం' తమిళ సినిమా ఆడియో విడుదల
- August 19, 2018
చెన్నై:చాలా సంవత్సరాల తర్వాత 'ఇయక్కునర్ ఇమయం' భారతిరాజా దర్శకత్వం వహించిన చిత్రం 'ఓం'. ఇందులో ఆయనే హీరోగా నటించారు. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం నగరంలోని కలైవానర్ అరంగంలో అత్యంత వైభవంగా జరిగింది. దర్శకులు కేఎస్ రవికుమార్, ఉదయ్‌కుమార్, భాగ్యరాజ్, అమీర్, పళనియప్పన్, రామ్, వెట్రిమారన్, సుశీంద్రన్, దర్శకుల సంఘం అధ్యక్షుడు విక్రమన్తోపాటు పలువురు సీనియర్, నేటి తర దర్శకులు పాల్గొని భారతిరాజాపై ప్రశంసల వర్షం కురిపించారు. అలాగే వైరముత్తు, మనోబాలా, నిర్మాత థానులతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైరముత్తు మాట్లాడుతూ ''తమిళ చిత్ర పరిశ్రమలో 'భారతిరాజా' అనే పేరు ఓ తారకమంత్రం లాంటిది. మునుపటి, నేటి తర యువకులంతా కలిసి ఈ మహా దర్శకుడిని అభినందించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఏ విధంగా అయితే తన నుండి విడిపోయిన భూమిని సూర్యుడు తనచుట్టూ తిప్పుకుంటున్నాడో.. అదేవిధంగానే తను దర్శకులను చుట్టూ తిప్పుకుంటున్నారు.
పేరు, ప్రఖ్యాతలు, డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో నేను సినీ పరిశ్రమలోకి రాలేదు. సంగీతమనే దారిలో చివరి వరకు తమిళ భాషకు సేవ చేయాలన్నదే నా లక్ష్యం. నిజం చెప్పాలంటే.. నేను పారిశ్రామికవేత్తగా మారుంటే ఈ పాటికి అంబానిలాగా ఉండేవాడిని.
రాజకీయాల్లోకి ప్రవేశించి ఉంటే వేరే రేంజ్లో ఉండేవాడిని. కానీ భాష పరమైన దారిలోనే నా గెలుపోటములు చూడాలనుకుని ఈ మార్గంలో ప్రయాణిస్తున్నట్లు' పేర్కొన్నారు. అనంతరం భారతిరాజా మాట్లాడుతూ 'మంచి విత్తనం ఏ నేలలో వేసినా మహావృక్షంగా మారుతుంది. అదేవిధంగా ప్రతిభ ఉన్న వ్యక్తి ఎక్కడ ఉన్నా..
ఉన్నతస్థాయికి ఎదుగుతారు. ఈ విషయాన్ని నా శిష్యులు చాలా మంది నిరూపించారు. నన్ను ఇంత మంది అభినందించడం ఆనందంగా ఉంది. కాస్త భిన్నమైన కథాంశంతో 'ఓం' సినిమా రూపొందించాం.నేటి తరాన్ని ఆకట్టుకుంటుందని' పేర్కొన్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి