'పందెంకోడి 2' సినిమా షూటింగ్ పూర్తి
- August 20, 2018
తెలుగు ఇండస్ట్రీలో తమిళ హీరోలు ఈ మద్య వరుస విజయాలతో దూసుకు పోతున్నారు. ముఖ్యంగా తెలుగు వాడైన విశాల్, సమంత నటించి 'అభిమన్యుడు' సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అంతకు ముందు డిటెక్టీవ్ చిత్రం కూడా మంచి విజయం సాధించింది. తెలుగు ఇండస్ట్రీలోకి 'పందెం కోడి'చిత్రంతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న విశాల్ వరుసగా తమిళ చిత్రాలు తెలుగు లో డబ్ చేశాడు.
తనకి స్టార్ డం తెచ్చిన తొలి చిత్రం 'పందెం కోడి'..ఈ చిత్రం సీక్వెల్ తీస్తున్న విషయం తెలిసిందే. లింగుస్వామి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి దాదాపు పన్నెండేళ్ల తర్వాత సీక్వెల్ వస్తుంది. పందెంకోడిలో మీరాజాస్మిన్ కథానాయకిగా నటించగా పందెంకోడి 2 లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.
తాజాగా ఈ చిత్రం షూటింగ్‌ను కంప్లీట్ చేసుకుంది. శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి మరో కథానాయకిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. విశాల్ 'టెంపర్' తమిళ రీమేక్‌లో నటించనున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







