కేరళ వరద బాధితుల కోసం ‘ఆర్ఎక్స్100’ బైక్..
- August 20, 2018
వరదల్లో చిక్కుకున్న వారికి సాయమందించడానికి మేమున్నామంటూ దాతలెంతో మంది ముందుకొస్తున్నారు. వారిలో ప్రముఖంగా చెప్పుకోవలసింది రాజకీయ నాయకులతో పాటు సినీ ప్రముఖులు. ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ఇండస్ట్రీ మొత్తం కదులుతుంది. మేమున్నామంటూ భరోసా ఇస్తుంది.
కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి లక్షల్లో విరాళాలనందిస్తున్నారు తమిళ ఇండస్ట్రీతో పాటు తెలుగు ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు, డైరక్టర్లు కూడా. తాజాగా ఆర్ఎక్స్100 టీం.. సినిమాలో తాము ఉపయోగించిన బైక్‌ని వేలం వేసి వచ్చిన మొత్తాన్ని వరద బాధితుల సహాయార్థం ఉపయోగించాలనుకుంటున్నారు. ఇందుకోసం బైక్ బిడ్ వాల్యూ రూ.50,000లుగా నిర్ణయించారు.
మీరు ఎంత మొత్తం చెల్లించి బైక్‌ని సొంతం చేసుకోవాలనుకుంటున్నారో ఆ వివరాలను [email protected] కి గానీ లేదా 9100445588 నెంబర్‌కి గానీ వాట్సాప్ చేయమంటోంది ఆర్ఎక్స్ యూనిట్.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







