భార్యా పిల్లల బాడీలను ఫ్రిడ్జ్‌లో, సూట్ కేసులో.. భర్త ఆత్మహత్య..
- August 20, 2018
ఢిల్లీ బురారీ ఘటనను మరవకముందే యూపీలో అలాంటిదే మరో ఘటన చోటు చేసుకుంది. అలహాబాద్ దమన్ గంజ్‌కు చెందిన ఓ కుటుంబం మొత్తం శవాలుగా కనిపించారు. భార్య శవం ఫ్రిడ్జ్‌లో ఉండగా, ఒక కూతురి శవం సూట్ కేసులో, మరో కూతురి శవం రూమ్‌లో, ఇంకో అమ్మాయిది అల్మారాలో ఉంది. భర్త బాడీ ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది.
ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. భార్యా పిల్లలను భర్తే హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ తరువాత భర్త ఉరి వేసుకుని ఉంటాడని భావిస్తున్నారు ఎస్పీ నితిన్ తివారీ. స్థానికులు అందించిన సమాచారం మేరకు భార్యా భర్తలిద్దరూ తరచూ గొడవలు పడుతుండేవారని చెబుతున్నారు.
మరింత లోతుగా విచారణ చేపట్టిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు అంటున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం డెడ్ బాడీలను హాస్పిటల్‌కు తరలించారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!