ఏపీ:చిన్న బడ్జెట్ సినిమా నిర్మాతలకు శుభవార్త
- August 21, 2018
అమరావతి: చిన్న బడ్జెట్ సినిమా నిర్మాతలకు శుభవార్త. రాష్ట్ర జీఎస్‌టీ నుంచి చిన్న సినిమాలకు మినహాయింపు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ చలన చిత్రమండలి అభివృద్ధి సంస్థ ఛైర్మన్ అంబికా కృష్ణ మీడియాతో మాట్లాడుతూ... చిన్న సినిమా బతికితే ఎంతో మందికి ఉపాధి లభిస్తుందన్నారు. చిన్న సినిమాలకు అండగా ఉండాలని, రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రూ.4 కోట్ల బడ్జెట్‌తో తీసే సినిమాలకు ప్రస్తుతం ఉన్న జీఎస్టీ 18శాతంలో ..రాష్ట్ర జీఎస్టీ 9శాతం తొలగిస్తామని స్పష్టం చేశారు. చిన్న సినిమాలకు రాష్ట్రంలోనే పోస్ట్ ప్రొడక్షన్ చేయాలనే నిబంధన పెట్టామన్నారు. వాణిజ్య పన్నులశాఖ లెక్కల ఆధారంగా రీఎంబర్స్ చేస్తామని వెల్లడించారు. సంస్కృతి, సంప్రదాయాలపై తీసిన 10 చిన్న సినిమాలకు ఏటా ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు. ఏపీలో షూటింగ్‌ల కోసం సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇస్తామని చెప్పారు. సినిమా థియేటర్లు కొందరి చేతిలోనే ఉన్న విషయం వాస్తవమేనన్నారు. రాష్ట్రంలో సినిమా చిత్రీకరణపై నటులు సానుకూలంగా స్పందిచారని అంబికా కృష్ణ తెలిపారు. చిన్న సినిమాలకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని నిర్మాతలు ఎప్పటి నుంచో ప్రభుత్వాన్ని కోరుతున్న విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంపై పలువురు చిన్న సినిమా నిర్మాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







