ఈ నెల 24న విడుదల కానున్న 'లక్ష్మి' సినిమా
- August 21, 2018
భారతీయ సినిమాల్లో డాన్స్‌కు ప్రత్యేకత తెచ్చిపెట్టిన ప్రభుదేవా నటునిగా, దర్శకునిగా కూడా రాణిస్తున్నారు. ఇండియన్ మైఖేల్ జాక్స్గా అభిమానులు పిలుచుకునే ప్రభుదేవా తాజా చిత్రం లక్ష్మి. బాలతారలు నటిస్తున్న ఈ చిత్రంలో ప్రభుదేవా కీలక పాత్రధారి. ఏ.ఎల్. విజయ్ దర్శకత్వం వహిస్తున్న లక్ష్మి చిత్రం ఇదే నెల 24న ప్రేక్షకుల ముందుకురానుంది. సినిమా ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్ వచ్చిన ప్రభుదేవా మీడియాతో కొద్దిసేపు ముచ్చటించారు.
లక్ష్మి చిత్రం డాన్స్ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమా విషయంలో దర్శకుడు విజయ్ ఓసారి నా దగ్గరకు వచ్చి డాన్స్ ప్రధానంగా సినిమా చేద్దామని చెప్పారు. అయితే ఇది ఓ రేంజ్లో ఉండాలని చెప్పాను. అప్పటికే నేను ఏబిసిడి సీక్వెల్ చేసి ఉన్నాను. కాబట్టి వాటిని మించి ఉండాలని సూచించాను. దాంతో దేశమంతా తిరిగి డాన్స్‌లో ప్రవీణ్యత ఉన్న పిల్లలను ఎంపికచేశారు. అందువల్లే ఈ సినిమాలో నేను నటించాను.
్శ ఇది గురుశిష్యులకు మధ్య జరిగే కథా చిత్రం. లక్ష్మి అనే అమ్మాయి కథ ఇది. లక్ష్మిగా నటించిన అమ్మాయి అద్భుతంగా డాన్స్ చేసింది. ఈ మధ్య యంగ్ జనరేషన్ బాగా డాన్స్‌లు చేస్తున్నారు.
్శ నేను నటించే సినిమాలకు కొరియోగ్రఫీ చేయాలనే ఆసక్తి తగ్గింది. అందుకే నా సినిమాలకు కొత్త వారిని పరిచయం చేస్తుంటాను. బయటి వారి సినిమాకు కొరియోగ్రఫి చేయాలని ఉంటుంది కానీ ఎవరూ అడగడం లేదు. ఈ మధ్యే ధనుష్ సినిమాకు పనిచేశా. తెలుగు సినిమాల్లో పాటలు చాలా భారీగా ఉంటున్నాయి. అందుకే నాకు బోర్ కొట్టినప్పుడల్లా తెలుగు పాటలు చూస్తుంటాను. ఇక్కడ పాటల్లో సెట్స్, డాన్స్‌లు, చిత్రీకరణ బావుంటుంది. ఐ లైక్ తెలుగు సినిమా.
నేను హీరోగా పరిచయం అయింది ప్రేమికుడు సినిమా ద్వారా అనే విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ చేయమని అడుగుతున్నారు. అప్పటి వయసుకి ఇప్పటి వయసుకు చాలా తేడా ఉంది. ప్రేమికుడు సీక్వెల్ చేస్తే ప్రేమికుడు 10 అని పెట్టాలి. ఇప్పటి వరకు అయితే సీక్వెల్ చేయాలనే ఆలోచన లేదు.
ప్రస్తుతం తమిళంలో హీరోగా రెండు సినిమాలు చేస్తున్నాను. జనవరి నుండి హిందీలో దబాంగ్ 3కి దర్శకత్వం వహిస్తున్నాను. ఇతర ప్రాజెక్ట్‌లు చర్చల దశలో ఉన్నాయి.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి