కేరళకు యూఏఈ సాయంపై మజ్లిస్ పార్టీ అధ్యక్షుడి స్పందన
- August 21, 2018
హైదరాబాద్: రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వ సవతి తల్లిప్రేమను విడనాడాలని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ.అసదుద్దీన్ఒవైసీ డిమాండ్ చేశారు. కేరళ వరద బాధితుల సహాయారం యూఏఈ ప్రభుత్వం రూ.700 కోట్లను ప్రకటించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. 2017లో భారతదేశానికి 69 బిలియన్ డాలర్ల విదేశీమారకద్రవ్యం సమకూరగా అందులో సుమారు 40శాతం వరకు కేరళ ప్రవాసుల నుంచి వచ్చినట్టు ఆయన గుర్తు చేశారు.
కేరళ వరద తాకిడిలో సుమారు రూ. 20వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్టుగా ప్రాథమిక అంచనా వేయగా కేంద్రం కేవలం రూ. 500 కోట్లు మాత్రమే సాయంగా ప్రకటించడం సిగ్గుచేటని ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయనేతల విగ్రహాల స్థాపన కోసం రూ. 2వేల నుంచి రూ.3వేల కోట్ల వరకు వ్యయం చేస్తున్న ప్రభుత్వాలు ఆపదల్లో చిక్కి కొట్టుమిట్లాడుతున్న కేరళ ప్రజలను ఆదుకునేందుకు నామమాత్రంగా సాయం ప్రకటించడం విచిత్రంగా ఉందన్నారు. ఇప్పటికైనా కేరళ ప్రజలను ఆదుకునేందుకు ఉదారంగా మరింత సాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







