ఏషియన్ గేమ్స్‌లో భారత షూటర్ల హవా...
- August 21, 2018
ఆసియా క్రీడల్లో భారత షూటర్ల హవా కొనసాగుతోంది. పురుషుల 10మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఇద్దరు భారత క్రీడాకారులు పతకాలు సాధించారు. 16 ఏళ్ల సౌరభ్ చౌదరి భారత్‌కు షూటింగ్‌లో తొలి స్వర్ణాన్ని అందించాడు. షూటర్ అభిషేక్ వర్మ కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. ఒక్క షూటింగ్‌లోనే భారత్ 5 పతకాలు గెలిచింది.
ఆసియా క్రీడల్లో భారత్ మొట్టమొదటి సెపక్‌తక్రా పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. సెపక్‌తక్రాలో భారత్‌కు ఇదే తొలి పతకం. ఈ పోటీల్లో సెమీఫైనల్ చేరిన జట్లకు కాంస్యం ఖాయమవుతుంది. అటు మహిళల రెజ్లింగ్‌లో దివ్య కక్రాన్ కాంస్యం గెలుచుకుంది. దీంతో భారత్ ఇప్పటి వరకూ 3 స్వర్ణాలు, 3 రజతాలు , 4 కాంస్యాలతో మొత్తం 11 పతకాలు సాధించింది.
కబడ్డీ పోటీల్లో భారత పురుషుల, మహిళల జట్లు సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లి పతకాలకు అడుగుదూరంలో నిలిచాయి. భారత రోయర్ దత్తు బాబన్ భోకనల్ పురుషుల సింగిల్ స్కల్స్ ఫైనల్ రౌండ్ చేరాడు. ఇక పురుషుల లైట్‌వెయిట్ టీమ్ ఈవెంట్, మహిళల పెయిర్ ఈవెంట్‌లలో భారత జట్లు ఫైనల్‌కు దూసుకెళ్లాయి. టెన్నిస్ డబుల్స్‌లో రోహన్ బోపన్న-దివిజ్ శరణ్, రామ్‌కుమార్-సుమిత్ జోడీలు, మహిళల సింగిల్స్‌లో అంకితా రైనా క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు.
హాకీలో భారత మహిళల జట్టు 21-0 గోల్స్ తేడాతో కజకిస్థాన్‌ను చిత్తుచిత్తుగా ఓడించింది. భారత జట్టులో నలుగురు క్రీడాకారిణులు హ్యాట్రిక్ గోల్స్‌తో విజృంభించారు. భారత స్టార్ దీపికా కుమారి వ్యక్తిగత విభాగంలో నిరాశాజనక ప్రదర్శన చేసింది. మహిళల వ్యక్తిగత రికర్వ్ విభాగం ర్యాంకింగ్ రౌండ్‌లో దీపిక 17వ స్థానంలో నిలిచింది. జూనియర్ మహిళల హ్యాండ్‌బాల్‌లో భారత బృందం కొరియా చేతిలో చిత్తయి, వరుసగా నాలుగో ఓటమితో పోటీలనుంచి నిష్క్రమించింది.
భారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్‌కు వాల్ట్ విభాగంలో చుక్కెదురైంది. వాల్ట్ క్వాలిఫికేషన్ రౌండ్లో దీప ఎనిమిదో స్థానంలో నిలిచింది. వాల్ట్ విభాగం నుంచి తెలుగమ్మాయి బుద్ధా అరుణా రెడ్డి, ప్రణతి నాయక్‌లు క్వాలిఫికేషన్ రౌండ్‌లో ఏడు, ఆరుస్థానాల్లో నిలిచి ఫైనల్‌కు దూసుకెళ్లారు. వాల్ట్‌లో చాన్స్ మిస్ చేసుకున్న దీప.. బ్యాలెన్స్ బీమ్‌లో మాత్రం ఫైనల్ చేరింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి