యూఏఈ సాయాన్ని తిరస్కరించనున్న ఇండియా
- August 22, 2018
యూఏఈ:వరదల కారణంగా విలవిల్లాడుతున్న కేరళను ఆదుకునేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం ముందుకు రాగా, ఆ సాయాన్ని భారత ప్రభుత్వం తిరస్కరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 100 మిలియన్ డాలర్స్ (సుమారు 700 కోట్ల రూపాయలు) ఆర్థిక సహాయాన్ని కేరళకు ప్రకటించింది. అబుదాబీ క్రౌన్ ప్రిన్స్, యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ సుప్రీమ్ కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, భారత ప్రధాని నరేంద్రమోడీతో మాట్లాడి ఈ సహాయం అందిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ధృవీకరించారు కూడా. యూఏఈలో నివసిస్తున్న భారతీయుల్లో 80 శాతం మంది కేరళీయులే. ఇదిలా ఉంటే, మాల్దీవ్స్ ప్రభుత్వం 50,000 డాలర్లను కేరళ వరద బాధితుల కోసం సహాయంగా ప్రకటించింది. ఐక్య రాజ్య సమితి సైతం కేరళ వరద బాధితుల్ని ఆదుకునేందుకు ముందుకొస్తోంది. అయితే విదేశాల నుంచి అందే సాయాన్ని తిరస్కరించాలని భారత ప్రభుత్వం భావిస్తుండడం గమనార్హం.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!







