ఐఎస్ఐఎస్‌పై దాడికి 34 దేశాలు

- December 16, 2015 , by Maagulf
ఐఎస్ఐఎస్‌పై దాడికి 34 దేశాలు

ఐఎస్ఐఎస్‌కు మంగళం పాడేందుకు సర్వం సిద్ధమవుతోంది. పారిస్ ఘటన నేపథ్యంలో.. ఐసిస్‌పై దాడికి 34 దేశాలు కలిశాయి. ఉగ్రవాదం కారణంగా ప్రపంచ దేశాల్లోని ముస్లింలపై అనుమాపు చూపులు పెరిగిపోతున్నాయి. ముస్లింలపై కొన్ని దేశాలు నిషేధం విధించే దిశగా పావులు కదుపుతున్నాయి. 34 ముస్లిం దేశాలు కలిపి సంకీర్ణ సేనలను తయారు చేస్తున్నాయి. సౌదీ అరేబియా నేతృత్వంలో రియాద్ కేంద్రంగా సంకీర్ణ సేనలు ఐఎస్ విరుచుకుపడనున్నాయి. ఈ దేశాల జాబితాలో ఈజిప్ట్, ఖతార్, యూఏఈ, టర్కీ, మలేషియా, పాకిస్థాన్, గల్ఫ్ అరబ్, ఆఫ్రికన్ అరబ్ దేశాలున్నాయి. ఇస్లామిక్ దేశాలను ఉగ్రవాదం నుంచి రక్షించుకోవడం తమ విధి అని దేశాలు పేర్కొన్నాయి. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని అంతం చేయడం విధిగా ఆ దేశాలు పాటుపడుతున్నాయి. ఐఎస్‌పై చర్యలు అంతర్జాతీయ సమాజంతో సమన్వయం చేసుకుని తీసుకోవాల్సిన నిర్ణయమని దుబాయ్ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com