ఇళ్ల పట్టాలను అందజేసిన ప్రధాని..
- August 23, 2018
ప్రధాని నరేంద్రమోడీ.. తన సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో పర్యటించారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సూరత్ చేరుకున్న ఆయన… వాల్సాద్ సమీపంలోని జుజువా గ్రామంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందజేశారు. అనంతరం సామూహిక గృహప్రవేశ కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. జుజ్వాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద లక్షకు పైగా ఇళ్లను నిర్మించారు.
దేశంలో ప్రతి కుటుంబానికీ ఓ సొంత ఇల్లు ఉండాలని… 2022 నాటికి ఈ లక్ష్యాన్ని సాధించాలన్నదే తన కల అని ప్రధాని మోడీ అన్నారు. కేంద్ర ప్రభుత్వ గృహ నిర్మాణ పథకం వల్ల ప్రయోజనం పొందడానికి ఎలాంటి ముడుపులు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. తన ప్రభుత్వంలో కమీషన్లు చెల్లించే వ్యవస్థకు చోటు లేదని చెప్పారు. తన ప్రభుత్వం ఢిల్లీ నుంచి ఒక రూపాయిని పంపిస్తే.. మొత్తం 100 పైసలు పేదల ఇంటికి చేరుతుందని మోడీ చెప్పారు.
మరోవైపు ధరమ్‌పూర్, కాప్రాడా ప్రాంతాల గిరిజనులకు నీటి సదుపాయం కల్పించే ప్రాజెక్టుకు ప్రధాని శంకుస్థాపన చేశారు. అనంతరం జోనాఘడ్‌లో కొత్తగా నిర్మించిన గుజరాత్ వైద్య విద్య పరిశోధన సొసైటీ ప్రారంభోత్సవం సహా పలు అభివృద్ధి పనుల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత గాంధీనగర్ చేరుకుని.. గుజరాత్ ఫోరెన్సిక్ సైన్స్ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవానికి మోడీ హాజరయ్యారు. విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







