రషిదియా - షార్జాలను కలుపుతూ కొత్త బస్‌ రూట్‌

- August 23, 2018 , by Maagulf
రషిదియా - షార్జాలను కలుపుతూ కొత్త బస్‌ రూట్‌

దుబాయ్‌ నుంచి షార్జా మధ్య ప్రయాణించేవారికి రోడ్స్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ (ఆర్‌టిఎ) గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఇ311 పేరుతో కొత్త రోజువారీ బస్‌ రూట్‌ని ఈ రెండు ఎమిరేట్స్‌ మధ్య ప్రకటించింది. 30 నిమిషాలకు ఓ బస్‌ ప్రయాణించేలా మొత్తం ఆరు బస్‌లను ఇందుకోసం కేటాయించింది ఆర్‌టిఎ. దుబాయ్‌లోని రష్దియా మెట్రో స్టేషన్‌ని షార్జాలోని అల్‌ జుబైల్‌ బస్‌ స్టేషన్‌ని ఈ బస్‌ రూట్‌ కలుపుతుందని ఆర్‌టిఎ డైరెక్టర్‌ ఫర్‌ ప్లానింగ్‌ అండ్‌ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ మొహమ్మద్‌ అబుబాకర్‌ అల్‌ హాషిమి చెప్పారు. రషిదియా మెట్రో స్టేషన్‌ నుంచి షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ రోడ్డు మీదుగా షార్జాలోకి ఎంటర్‌ అవుతుంది. ఈ రూట్‌లో నిత్యం ప్రయాణించేవారికి ఈ బస్‌లు ఎంతగానో ఉపకరిస్తాయని అల్‌ హాషిమి చెప్పారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com