దుబాయ్:పార్కింగ్‌ చేసిన కారులో వ్యక్తి మృతదేహం

- August 23, 2018 , by Maagulf
దుబాయ్:పార్కింగ్‌ చేసిన కారులో వ్యక్తి మృతదేహం

దుబాయ్:పార్కింగ్‌ చేసిన కారులో ఓ వ్యక్తి మృతదేహం వుండడానికి సంబంధించి సమాచారం అందుకోగానే పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ క్రమంలో ఇద్దరు జిసిసి జాతీయుల్ని అరెస్ట్‌ చేశారు. వారే 19 ఏళ్ళ ఎమిరేటీ వ్యక్తిని హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. నాడ్‌ అల్‌ హమార్‌లోని శాండీ ఏరియాలో పార్క్‌ చేసిన కారులో మృతదేహం లభ్యమయ్యింది. అరెస్టయినవారిలో ఓ వ్యక్తి, మృతుడి బంధువే కావడం గమనార్హం. చిన్నపాటి గొడవ ఈ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. గొడవ పెరిగి, నిందితులు ఆ వ్యక్తిని పొడిచి చంపారు. హత్య అనంతరం, మృతదేహాన్ని కారులో తీసుకెళ్ళి దూరంగా విడిచిపెట్టి వచ్చేశారు. కారుని తగలబెట్టేందుకూ నిందితులు యత్నించినట్లు పోలీసులు తెలిపారు.
  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com