‘ఎంసీఏ’ కి కొత్త అర్ధం చెప్పిన ‘మెగా’ మెంబర్

- August 24, 2018 , by Maagulf
‘ఎంసీఏ’ కి కొత్త అర్ధం చెప్పిన ‘మెగా’ మెంబర్

ఒకప్పుడు ‘ఎంసీఏ’ అంటే మాస్టర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ అని అదొక మాస్టర్స్ డిగ్రీ అని అందరికి తెలుసు. కానీ నానీ వచ్చి ‘ఎంసీఏ’ కు ఉన్న అర్థాన్ని పూర్తిగా మార్చేశాడు. మిడిల్ క్లాస్ అబ్బాయ్ అంటూ ఓ కొత్త అర్థాన్ని పరిచయం చేశాడు. యూత్ అంతా ఎంసీఏ ( మిడిల్ క్లాస్ అబ్బాయి) కి బాగా కనెక్ట్ అయిపోయారు.ఇప్పుడు తాజాగా మెగా హీరో ఎంసీఏ అనే పదానికి మరో కొత్త అర్థాన్ని చెబుతున్నాడు.

బుధవారం చిరంజీవి బర్త్‌డే సందర్భంగా చిరుతో దిగిన ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ.. ఓ కామెంట్ పెట్టాడు అల్లువారబ్బాయి అల్లు శిరీష్. ‘ఎట్టకేలకు నేను నా సిగ్గును జయించి.. మా మామయ్యను ఓ సెల్ఫీ అడిగాను. ఆయనకున్న కోట్ల అభిమానుల్లో నేను కూడా ఒకడిని.. నేను ఎంసీఏ (మెగాస్టార్‌ చిరంజీవి అభిమాని)ని అయినందుకు నేనెప్పుడూ గర్వపడుతుంటా’ అంటూ పోస్ట్ పెట్టాడు. దీంతో కొంత మంది నెటిజన్లు మేము కూడా ఎంసీఏ(మెగాస్టార్‌ చిరంజీవి అభిమాని) అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com