యూ.ఏ.ఈ :స్కూల్‌ ఖర్చుల్లో డిస్కౌంట్‌ కోసం చూస్తున్న పేరెంట్స్‌

- August 25, 2018 , by Maagulf
యూ.ఏ.ఈ :స్కూల్‌ ఖర్చుల్లో డిస్కౌంట్‌ కోసం చూస్తున్న పేరెంట్స్‌

యూ.ఏ.ఈ:సమ్మర్‌ ముగుస్తోంది. స్కూళ్ళు తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లల స్కూల్‌ ఖర్చుల్ని తగ్గించుకునేందుకు మార్గాల్ని అన్వేసిస్తున్నారు. యూనిఫామ్‌లు, బుక్స్‌, స్టేషనరీ ఐటమ్స్‌, బుక్‌ బ్యాగ్స్‌, లంచ్‌ బాక్స్‌లను కొనుగోలు చేసే క్రమంలో డిస్కౌంట్స్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. ఆర్థికంగా పరిస్థితులు ఏమంత బాగా లేని ఈ పరిస్థితుల్లో స్కూల్‌ ఖర్చులలో తగ్గుదల కోసం ప్రయత్నిస్తున్నామని పేరెంట్స్‌ తెలిపారు. ఇద్దరు పిల్లల తల్లి అర్చనా దేశాయ్‌ మాట్లాడుతూ, తమ పిల్లల్ని స్కూల్‌కి పంపించేందుకు 500 దిర్హామ్‌ల ఖర్చు చేయాల్సి వస్తోందని చెప్పారు. యూనిఫామ్‌ ధరలు ఎక్కువగా వున్నాయనీ ఆమె అన్నారు. ప్రాచీ సిన్హా అనే హహిళ మాట్లాడుతూ తమ పిల్లల్ని స్కూల్‌కి పంపించాల్సి వుందనీ, డిస్కౌంట్‌ల కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు. పలువురు తల్లిదండ్రులు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. స్కూల్‌ ఫీజులు, ఇతర ఖర్చులు భారంగా మారుతుండడంతో ఎంతో కొంత ఖర్చులు తగ్గుతాయనే ఆలోచనతో, డిస్కౌంట్‌ సేల్‌ కోసం ఎదురుచూస్తున్నట్లు మెజార్టీ పేరెంట్స్‌ చెప్పారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com