గూగుల్ సెర్చ్ వర్క్.....
- December 16, 2015
భారత దేశ అవసరాల దృష్ట్యా కొత్త ఉత్పత్తుల కోసం హైదరాబాదులో నూతన ప్రాంగణం ఏర్పాటు చేస్తామని గూగుల్ సీఈవో సుందర్ పిచాయి బుధవారం నాడు చెప్పారు. భారత్‌లోని 100 రైల్వే స్టేషన్లలో వైఫై సౌకర్యం కల్పిస్తామన్నారు. వచ్చే డిసెంబరు నాటికి రైల్‌టెల్ సహకారంతో వైఫై సదుపాయం కల్పిస్తామన్నారు. రానున్న రోజుల్లో భారత్‌లోని వంద కోట్ల ఇంటర్నెట్ వినియోగదారుల కోసం మేం ఉత్పత్తులు తీసుకు వస్తామని చెప్పారు. రానున్న మూడేళ్లలో భారత్‌లోను మూడు లక్షల గ్రామాలకు ఇంటర్నెట్ తీసుకు వెళ్తామన్నారు. తాను గూగుల్‌లో చేరడానికి ప్రేరేపించిన విషయాన్ని కూడా సుందర్ పిచాయ్ తెలిపారు. భారత దేశంలోని చిన్న నగరంలోని ఓ పేద బాలుడు, అలాగే స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో పని చేసే ఆచార్యుడి విషయంలోను గూగుల్ సెర్చ్ వర్క్ ఒకేలా ఉంటుందన్నారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్‌లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







