ఇండియన్ నేవీ కోసం హెలికాప్టర్ల కొనుగోలుకు డీఏసీ ఆమోదం

- August 25, 2018 , by Maagulf
ఇండియన్ నేవీ కోసం హెలికాప్టర్ల కొనుగోలుకు డీఏసీ ఆమోదం

ఇండియన్‌ నేవీ కోసం హెలికాప్టర్ల కొనుగోలుకు డీఏసీ ఆమోదం తెలిపింది. 24 మల్టీ రోల్ హెలికాప్టర్లతోపాటు ఇతర కొనుగోళ్ళకు రక్షణ మంత్రిత్వ శాఖ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. వీటికి 46 వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేసింది.

నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న మేక్ ఇన్ ఇండియా పథకానికి ఊపునిచ్చేందుకు చేపట్టిన వ్యూహాత్మక భాగస్వామ్యం విధానంలో ఇది తమ తొలి ప్రాజెక్టు అని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ విధానంలో విదేశీ ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫ్యాక్చరర్ నుంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని భారతదేశ వ్యూహాత్మక భాగస్వామికి బదిలీ చేస్తారని, ఇండియన్ స్ట్రాటజిక్ పార్టనర్ భారీ రక్షణ పరికరాలను భారతదేశంలోనే తయారు చేస్తారని వివరించింది.

డీఏసీ అనుమతులకు 18 నెలల గడువు ఉంటుంది. ఈ గడువులోగా భారత నావికా దళం ఈ ప్రక్రియను అమల్లో పెట్టాలి. ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫ్యాక్చరర్‌ ఎంపిక చేయాలి. ఆ ఓఈఎం తగిన ఇండియన్ పార్టనర్‌ను సమకూర్చుకుని, భారతదేశంలో హెలికాప్టర్లను తయారు చేయవలసి ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com