విక్రాంత్‌ హీరోగా 'బక్రీద్‌' సినిమా

- August 27, 2018 , by Maagulf
విక్రాంత్‌ హీరోగా 'బక్రీద్‌' సినిమా

శివ, సంతానం నటించిన 'యాయా' చిత్రాన్ని నిర్మించిన సంస్థ ఎం10 ప్రొడక్షన్స్‌. ప్రస్తుతం ఈ సంస్థ తెరకెక్కిస్తున్న చిత్రం 'బక్రీద్‌'. 'సిగై', 'పక్షి' చిత్రాలను తెరకెక్కించిన జగదీశన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు సమకూర్చడంతో పాటు సినిమాటోగ్రఫి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. విక్రాంత్‌ హీరోగా నటిస్తున్నారు. చాలా గ్యాప్‌ తర్వాత ఆయన కథానాయకుడిగా నటిస్తున్న సినిమా ఇది. ఈ సినిమా గురించి దర్శకుడు జగదీశన్‌ మాట్లాడుతూ 'రైతుగా జీవించడమే గొప్పగా భావిస్తూ, ప్రతికూల పరిస్థితుల్లోనూ వ్యవసాయాన్ని చేసే ఓ వ్యక్తి జీవితంలోకి ఒంటె ప్రవేశిస్తుంది.

ఆ తర్వాత అతని జీవితం ఎలా మారిందన్నదే చిత్ర కథ. ఈ కథ దేశవ్యాప్తంగా నడుస్తుంది. అందుకే ఆయా రాష్ట్రాల్లోని సంస్కృతి, సంప్రదాయాలను ఇందులో ప్రతిబింబించాం. చెన్నై, రాజస్థాన్‌, గోవా, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో కీలక సన్నివేశాలను తెరకెక్కించాం.

ఇమాన్‌ అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలోనే సినిమాను విడుదల చేయనున్నామని' పేర్కొన్నారు. రూబన్‌ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com