ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన పి.వి సింధు
- August 27, 2018
ఆసియా క్రీడల్లో భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పివి సింధు చరిత్ర సృష్టించింది. మహిళల సింగిల్స్‌లో ఫైనల్స్ చేరిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది. ఆసియా క్రీడల బ్యాడ్మింటన్‌లో భారత్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. ఇప్పటికే పతకం ఖాయం చేసుకున్న సింధు సెమీస్‌లో 21-17,15-21, 21-10 స్కోర్‌తో యమగుచిపై విజయం సాధించింది.ఈ మ్యాచ్ ఆరంభం నుంచి ఆసక్తికరంగా సాగింది. తొలి గేమ్ సింధు గెలిస్తే… తర్వాత పుంజుకున్న యమగుచి స్కోర్ సమం చేసింది. అయితే మ్యాచ్ డిసైడింగ్ గేమ్‌లో మాత్రం సింధు పూర్తి ఆధిపత్యం కనబరిచింది. తనదైన నెట్‌గేమ్‌తో ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా మ్యాచ్ కైవసం చేసుకుంది. ఫైనల్లో సింధు , వరల్డ్ నెంబర్ వన్ తైజుయింగ్‌తో తలపడనుంది. అటు మరో సెమీస్‌లో పరాజయం పాలైన సైనా కాంస్యంతో సరిపెట్టుకుంది.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







