కువైట్ లో సింహం తప్పించుకుని రోడ్డుపైకొచ్చింది..

- August 27, 2018 , by Maagulf
కువైట్ లో సింహం తప్పించుకుని రోడ్డుపైకొచ్చింది..

కువైట్:జూలో ఉన్న జంతువులు రోడ్లపై దర్శనమిస్తున్నాయి. ఏదో చిన్నా చితకా జంతువైతే ఏమోలే అనుకోవచ్చు. కానీ మనిషి కనపడితే ఒక్కసారి పంజావిసిరి పీసులు పీసులు చేసే సింహాలు, పులులు ఏకంగా రోడ్లపై ప్రత్యక్షమవుతున్నాయి. వీటిని చూసిన జనాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీస్తున్నారు. ఇలాంటి ఘటనే కువైట్‌లో చోటుచేసుకుంది. రోడ్డుపైకి ఒక పెద్ద సింహం ప్రత్యక్షమవడంతో జనాలు కంగారు పడ్డారు. అయితే ఆ సింహం ఎవరికీ హానీ తలపెట్టలేదు. ఆ సింహాన్ని పట్టుకున్న అధికారులు జూకు తరలించారు.
ఇక కువైట్‌లో ఓ పెద్ద సింహం నడిరోడ్డుపై దర్శనం ఇచ్చింది. కబాద్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ సింహం జూ నుంచి తప్పించుకున్న సింహం కాదు... ఎవరో ఇంట్లో పెంచుకుంటున్న సింహం. ఒక్కసారిగా నివాస ప్రాంతంలోకి కనపడిపోయేసరికి అక్కడి ప్రజలు భయంతో పరుగులు తీశారు. వెంటనే జూ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న వారు ఆ పెద్ద సింహానికి మత్తు మందు ఇచ్చి అదుపులోకి తీసుకొచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. దీనిపై కొందరు నెటిజెన్లు తమదైన శైలిలో కామెంట్ చేశారు.
ఆ సింహం ఎలా వచ్చిందని కొందరు నెటిజెన్లు ప్రశ్నిస్తే... మరికొందరు భయంకరమైన జీవి అంటూ కామెంట్ చేశారు. అయితే ఇది ఒక ఇంట్లో పెంపుడు జంతువని అక్కడి నుంచి తప్పించుకుని వచ్చిందని ఒక అధికారి వెల్లడించారు. ఇప్పుడు ఈ సింహం ఓనర్ కోసం అధికారులు వెతుకుతున్నారు. ఒకవేళ ఓనర్ దొరికితే అతనికి మూడేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కువైట్‌లో క్రూర జంతువులను ఇళ్లల్లో పెంచుకోవడం నేరంగా పరిగణిస్తారు. గతేడాది పాకిస్తాన్‌లో ఓ వ్యక్తి అతని కారులో ఓ సింహాన్ని తీసుకెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఆ సింహం అనారోగ్యం బారిన పడటంతో దానిని డాక్టరు దగ్గరకు తీసుకెళ్లినట్లు వివరణ ఇచ్చాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com