వినాయకచవితికి నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త చిత్రం ఫస్ట్ లుక్..

- August 27, 2018 , by Maagulf
వినాయకచవితికి నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త చిత్రం ఫస్ట్ లుక్..

నందమూరి హీరో కల్యాణ్ రామ్ తాజాగా సినిమాటోగ్రాఫర్ గుహన్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమా ఇప్పటికే 90 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది..చివరి షెడ్యూల్లో ఇక ఒక భారీ ఫైట్, ఒక పాటను చిత్రీకరించనున్నారు.. ఈ ఫైట్ ను అండర్ వాటర్లో షూట్ చేయనున్నారు..విశాఖ తీరంలోని సముద్రంలో షూటింగ్ జరగనుంది.. దీని కోసం విదేశాల నుంచి డైవింగ్ ఎక్స్ పర్ట్స్ ను రప్పిస్తున్నారు. ఈ మూవీ టైటిల్ తో పాటు , ఫస్ట్ లుక్ ని కూడా వినాయకచవితి రోజున చిత్ర యూనిట్ రిలీజ్ చేయనుంది.. ఈ మూవీకి మహేష్ కోనేరు దర్శకుడు.. షాలిని పాండే, నివేథా థామస్ లు హీరోయిన్స్..

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com