దుబాయ్:కేరళకు వెళ్ళే ఉద్యోగులకు పెయిడ్ హాలిడే
- August 27, 2018
దుబాయ్:వరదలతో విలవిల్లాడిన కేరళకు అన్ని వైపుల నుంచీ సంఘీభావం లభిస్తోంది. దుబాయ్‌కి చెందిన ఓ ఇన్స్యూరెన్స్ కంపెనీ, కేరళకు వెళ్ళే తమ సిబ్బందికి వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాలని నిర్ణయించింది. దర్ అల్ తకాఫుల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమువుతోంది. ఇలాంటి సందర్భాల్లో మానవతా కోణంలో ఆలోచించాల్సి వుంటుందనీ, కేరళలో వున్న తమ కుటుంబీకుల పరిస్థితిపై దుబాయ్‌లో వున్న కేరళీయుల ఆందోళన అర్థం చేసుకోదగ్గదని, అందుకే తమ ఉద్యోగులకు ఈ అవకాశం కల్పిస్తున్నామని దర్ అల్ తకాఫుల్ మేనేజింగ్ డైరెక్టర్, వైస్ ఛైర్మన్ సలెహ్ అల్ హాషిమి చెప్పారు. దీంతోపాటుగా తమ కంపెనీ ఇప్పటికే కేరళ వరద బాధితుల కొసం డొనేషన్ చేసినట్లు చెప్పారాయన.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







