బహ్రెయిన్:కార్ల దొంగలకు మూడేళ్ళ జైలు

- August 27, 2018 , by Maagulf
బహ్రెయిన్:కార్ల దొంగలకు మూడేళ్ళ జైలు

బహ్రెయిన్:కార్లను దొంగిలించి, ఆ కార్లను డిస్‌ అసెంబ్లింగ్‌ చేసి పార్టులు పార్టులుగా వాటిని విక్రయిస్తోన్న ముఠాని అరెస్ట్‌ చేయడం జరిగింది. సెక్యూరిటీ కెమెరాలను పరిశీలించిన అనంతరం అత్యంత చాకచక్యంగా నిందితుల్ని గుర్తించారు. ముందుగా వాహనాల్ని టౌల్‌ చేసి, ఆ తర్వాత ఆ వాహనాల్ని ఇసా టౌన్‌ వైపుకు తీసుకెళ్ళి, అక్కడ వాహనాన్ని డిస్‌ అసెంబ్లింగ్‌ చేస్తున్నారు నిందితులు. ముందుగా టౌలింగ్‌ కార్‌ని డిటెక్టివ్స్‌ గుర్తించారు. ఆ నెంబర్‌ ఆధారంగా ఆ వాహన ఓనర్‌ని ప్రశ్నిస్తే, మొత్తం బండారం బయటపడింది. 2017 నుంచి 2018 వరకు పలు కార్లను నిందితులు దొంగిలించినట్లు పోలీసులు తేల్చారు.    న్యాయస్థానం నిందితులకు మూడేళ్ల జైలు శిక్షను విధించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com