కారులో ప్రయాణించేటప్పుడు ఈ పనులు తప్పకుండా చెయ్యాలి...
- August 29, 2018
కారు ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి.అయితే అందుకు కారణం సరైన జాగ్రత్తలుపాటించడంలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.కారులో ప్రయాణించే ముందు అందులోని ప్రతి ఒక్కరు తప్పకుండా సీటు బెల్టు ధరించాలి.అన్ని సమయాల్లో సీటు బెల్టు అక్కరలేదనుకుంటే పొరపాటే..దురదృష్టవశాత్తు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైతే కచ్చితంగా సీటుబెల్టు రక్షిస్తుంది. కారులో సీటుకు అమర్చిఉండే బెల్టు కారు ప్రమాదానికి గురైనపుడు.. మనిషిని ముందుకు వెనక్కి పడకుండా ఆపుతుంది.అంతేకాకుండా ఆ సమయాల్లో కారు డోర్లు విరిగిపోయినా సీటు బెల్టు కారణంగా ప్రయాణికుడు బయటకు పడిపోడు. దీంతో కొంత మేర ప్రమాదం నుండి బయటపడవచ్చు. సీటు బెల్టు పెట్టుకున్న వారిలో 100 శాతం ప్రమాదాలకు గురికారాని నిపుణులు చెబుతున్నారు. అలాగే కారులో ప్రయాణించేటప్పుడు చేయాల్సిన మరో ముఖ్యమైన పని సీటు బెల్టు అలారం లను లాక్ చెయ్యకుండా ఉండటం. ఒకవేళ అవి లాక్ చేస్తే సీటు బెల్టు ధరించలేదన్న విషయం మరచిపోవచ్చు.. కాబట్టి అలారం ఇండికేషన్ లాక్ చెయ్యకూడాదు. ఇక పోతే కారు ప్రమాదాలకు గురైనప్పుడు కారులో ఉండే ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకుని ప్రయాణికుడికి రక్షణగా నిలుస్తాయి. ఇవి కూడా కొన్ని సమయాల్లో పనిచేయవని కొందరు నిపుణులు అంటున్నారు.ఇందుకు కారణం అవి స్టక్ అయిపోవడమే.. వెహికల్ లను సర్వీసింగ్ కు ఇచ్చే సమయాల్లో ఎయిర్ బ్యాగ్స్ ను పిన్ టు పిన్ చెక్ చేయించాలి లేదంటే.. అందులోకి దుమ్ము ధూళి చేరి స్టక్ అవుతాయి.ఇప్పుడు వస్తున్న కొన్ని కార్లలో సీటు బెల్టుకు కూడా ఎయిర్ బ్యాగ్స్ కనెక్టింగ్ ఉంటుందని అంటున్నారు నిపుణులు. అయితే ఎయిర్ బ్యాగ్స్ ముఖ్యంగా వెహికల్ ప్రమాదానికి గురైనపుడు సెన్సార్ కారణంగానే ఓపెన్ అవుతాయనేది అందరికి తెలిసిన విషయం.కానీ కొన్ని కార్లకు సీటు బెల్టు పెట్టుకుంటేనే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవుతాయని అంటున్నారు.అలాగే డ్రైవర్లు కారు డ్రైవ్ చేయడానికంటే ముందు ఇంజిన్ కండీషన్, బ్రేకులు వంటివి సరిచూసుకోవాలి. ఇంకో అతిముఖ్యమైనది మద్యం సేవించి వాహనం నడపకుండా ఉండటం శ్రేయస్కరం.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







