మహా ప్రస్థానంలో హరికృష్ణ అంత్యక్రియలు..
- August 29, 2018
హైదరాబాద్:నందమూరి కుటుంబంలో పెను విషాదం.. టీడీపీ సీనియర్ నేత, పొలిట్ బ్యూరో సభ్యుడు హరికృష్ణ మరణం నందమూరి కుటుంబాన్ని దుఃఖ సాగరంలోకి నెట్టింది. నాలుగేళ్ల కిందట పెద్దకొడుకు మరణం.. ఇప్పుడు అదే తరహాలో మృత్యువు హరికృష్ణను కబళించింది.. హరికృష్ణ అంత్యక్రియలు ఈరోజు మహాప్రస్థానంలో జరగనున్నాయి. హరికృష్ణ అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మధ్యాహ్నం రెండున్నర గంటలకు అంతిమయాత్ర ప్రారంభం అవుతుంది.
సినీ, రాజకీయాల్లో డేరింగ్ పర్సనాలిటీగా పేరున్న నందమూరి హరికృష్ణ హఠాన్మరణం తెలుగు ప్రజలను దిగ్బ్రాంతికి గురి చేసింది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా, మాజీ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన హరికృష్ణ అంత్యక్రియలు ఈ రోజు ఫిల్మ్ నగర్ లోని మహాప్రస్థానంలో జరగనున్నాయి.
కల్మషం లేని వ్యక్తిగా ఎంతో మంది ఆప్తులను సంపాదించుకున్న హరికృష్ణను..కడసారి చూసేందుకు అభిమానులు మోహదీపట్నంలోని ఆయన ఇంటికి భారీగా తరలొస్తున్నారు. సినీ, రాజకీయ నేతలు ఆయన పార్ధివ దేహానికి నివాళులర్పిస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం వరకు ఆప్తులు, అభిమానుల సందర్శనార్థం హరికృష్ణ భౌతికకాయన్ని మోహదీపట్నంలోనే ఉంచుతారు. మధ్యాహ్నం రెండున్నర తర్వాత అంతిమయాత్రం ప్రారంభం అవుతుంది. సాయంత్రం నాలుగు గంటల తర్వాత జూబ్లీహిల్స్‌లోని మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.
హరికృష్ణ మృతదేహానికి నివాళులు అర్పించేందుకు వచ్చిన కేసీఆర్ చంద్రబాబుతో మాట్లాడి ఏర్పాట్లపై ఆరా తీశారు. అంతిమ సంస్కారాలపై ఇరువురు చర్చించారు. అనంతరం కేసీర్ అక్కడి అధికారులకు పలు సూచనలు చేశారు. నివాసం వద్ద భద్రతతో పాటు.. అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లపై ఆరా తీశారు. మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ను దగ్గరుండి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
అటు ఏపీ ప్రభుత్వం హరికృష్ణ అకాల మృతి పట్ల రెండు రోజుల సంతాప దినాలుగా ప్రకటించింది. ఇక అంతిమయాత్రకు నందమూరి అభిమానులు, పార్టీ కార్యకర్తలు భారీగా తరలొచ్చే అవకాశాలు ఉండటంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. మరోవైపు అన్నగారి రథసారధిగా చైతన్య రథాన్ని నడిపించిన హరికృష్ణ అంతిమయాత్రను అదే చైతన్య రథం మీద నిర్వహించే ఆలోచన ఉన్నారు నందమూరి కుటుంబ సభ్యులు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి