హైదరాబాద్:భారీ మోసం.. నిరుద్యోగులకు గాలం..
- August 29, 2018
హైదరాబాద్:ఉద్యోగాల పేరుతో భారీ మోసానికి పాల్పడింది ఓ ముఠా. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులకు గాలం వేశారు. ఒక్కొక్కరి దగ్గరి నుంచి లక్షల్లో వసూలు చేశారు. జాబ్ వచ్చినట్లు ఏకంగా అపాయింట్‌మెంట్ లెటర్లు కూడా ఇచ్చారు. ఎంతోమంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న ఈ ముఠాను ఎస్వోటీ పోలీసులు కటకటాల్లోకి నెట్టారు.
మొత్తం నలుగురు సభ్యుల ముఠా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాబ్స్ ఇప్పిస్తామంటూ భారీ మోసానికి తెరతీసింది. హైదరాబాద్‌లోని మల్కాజిగిరికి చెందిన శ్రీకాంత్, మలక్‌పేటకు చెందిన సంజయ్, సికింద్రాబాద్‌కు చెందిన గౌరీ శంకర్, చైతన్యపురికి చెందిన ఉమాదేవి ఓ ముఠాగా ఏర్పడ్డారు. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు గాలం వేశారు. జాబ్స్ ఇస్తున్నట్లు ప్రభుత్వ సంస్థల పేరుతో నకిలీ మెయిల్స్ పంపి నిరుద్యోగుల్లో లేనిపోని ఆశలు కల్పించారు. వాళ్లు కాంటాక్ట్ చేయగానే ఒక్కో ఉద్యోగానికి అడ్వాన్స్‌గా ఐదు లక్షల చొప్పున వసూలు చేశారు ఈ కంత్రీలు.
నిరుద్యోగుల నుంచి ఐదు లక్షల చొప్పున అడ్వాన్స్ వసూలు చేసి… వాళ్లను తెలివిగా మోసం చేయడం ప్రారంభించారు. డబ్బిచ్చిన వారికి అనుమానం రాకుండా ఉండడానికి నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్లు ఇచ్చేవారు. వాటితోపాటే ట్రైనింగ్‌కు పంపుతున్నట్లు ఫేక్ లెటర్లు పంపేవారు. వాటిని తీసుకుని ఉద్యోగాలకు వెళ్లిన నిరుద్యోగులకు భంగపాటు తప్పలేదు. తాము మోసపోయినట్లు గుర్తించిన నిరుద్యోగులు… పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన రాచకొండ ఎస్వోటీ పోలీసులు… నకిలీ జాబ్ రాకెట్ గుట్టును రట్టు చేశారు. ఘరానా మోసానికి పాల్పడిన నలుగురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని వివిధ శాఖల్లో ఉద్యోగాలు ఉన్నాయని, రైల్వే శాఖలోనూ భారీగా ఖాళీలు ఉన్నాయని బంధువులు, సన్నిహితుల ద్వారా ప్రచారం ప్రారంభించారు. ఆ ఉద్యోగాలు తెలిసిన వారి ద్వారా భర్తీ చేస్తున్నారని నమ్మించారు. ఒక్కో ఉద్యోగానికి 16 లక్షలకు బేరం పెట్టారు. అడ్వాన్స్‌గా 5 లక్షలు డిమాండ్ చేశారు. జాబ్ గ్యారంటీ అనడంతో నిరుద్యోగులు క్యూ కట్టారు.
అప్పోసప్పో చేసి డబ్బు తెచ్చి ఈ ముఠా చేతిలో పోశారు. ఇక ఈ కంత్రీలు ఆ డబ్బుతీసుకుని జల్సాలు చేశారు. వీళ్లను నమ్మి అడ్వాన్స్ ఇచ్చిన వాళ్లను నిండా ముంచారు. నలుగురిని అరెస్ట్ చేసిన రాచకొండ ఎస్వోటీ, వాళ్లను చైతన్యపురి పోలీసులకు అప్పగించారు.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







